Rana: లగేజ్ మిస్ అవ్వడం పై రానాకు క్షమాపణలు చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్!

ప్రముఖ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇండిగో ఎయిర్ లైన్ పనితీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఇండిగో ఎయిర్లైన్స్ అంత చెత్త సర్వీస్ ఏ ఎయిర్ లైన్స్ సమస్థ అందించలేదంటూ ఈయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ చేసినటువంటి ట్వీట్ పై ఎయిర్లైన్స్ సంస్థ స్పందించి తనకు క్షమాపణలు తెలియజేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి రానా ఇండిగో ఎయిర్ లైన్స్ టికెట్ బుక్ చేసుకుని శంషాబాద్ విమాశ్రయానికి వెళ్లారు.

అక్కడ లగేజ్ చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్లైట్ ఆలస్యం కావడంతో మరో ఫ్లైట్లో అందరిని బెంగళూరు పంపించారు. ఈ క్రమంలోనే రానా లగేజ్ మిస్ కావడంతో ఈయన ఇండిగో సర్వీసులపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. బెంగళూరు చేరుకున్న తర్వాత తన లగేజ్ రాకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించడంతో వారి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఈయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా ఇండియాలో ఇండిగో అంత చెత్త విమాన ప్రయాణం చేయలేదు.

విమానం టైమింగ్స్ గురించి ఎవరికీ తెలియదు. పోయిన లగేజ్ గురించి కూడా ఎవరికీ తెలియదు. ఇంతకన్నా చెత్త సర్వీస్ ఇంకా ఏది ఉండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా ఈయన చేసిన ట్వీట్ పై ఇండిగో సమస్త స్పందిస్తూ ముందుగా రానాకు క్షమాపణలు చెప్పారు. మీ లగేష్ వీలైనంత త్వరగా మీకు చేరవేయడానికి మా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు అంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందిస్తూ రానా ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. ఇక రానా సినిమాల విషయానికొస్తే విరాటపర్వం సినిమా తర్వాత ఈయన ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus