ఛాన్స్ కావాలంటే బెడ్ రూమ్ కి రమ్మన్నారు: పార్వతి
- April 3, 2017 / 12:00 PM ISTByFilmy Focus
రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి మంచి నటిగా గుర్తింపు సాధించుకోవాలని కలలు కనే వారికి యువతులకు కొంతమంది అడ్డుగా మారుతున్నారు. అందాన్ని అరువు ఇస్తే.. హీరోయిన్ ఛాన్స్ ఇస్తామంటూ పరిశ్రమకి తాచుపాముల్లా మారుతున్నారు. వీరి కాటుకి బలై కొంతమంది పరిశ్రమను వదిలేసి వెళ్లి పోతే.. మరికొంతమంది ఆ పాముని ఎదిరించి విజయాలను అందుకున్నారు. ఇప్పుడు ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత తమకి ఎదురైనా అనుభవాలను దైర్యంగా మీడియాకు చెబుతున్నారు. టాలీవుడ్ లో మాధవీలత, అర్చన, కోలీవుడ్ లో వరలక్ష్మీ శరత్ కుమార్, సంధ్య, కస్తూరి లాంటివారు తాము అనుభవించిన లైంగిక వేధింపుల గురించి వివరించారు. తాజాగా మల్లూవుడ్ నటి పార్వతి తనకి ఎదురైనా చేదు అనుభవాన్ని బయట పెట్టింది.
బెంగళూరు డేస్ సినిమాతో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..”హీరోయిన్ గా ఛాన్స్ కావాలంటే బెడ్ రూమ్ కి వెళ్లాలనే మాటకు నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు.. దర్శకులు నన్ను అలా పిలిచారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అంటూ సలహా కూడా ఇచ్చారు. నేను నో చెప్పడంతో ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది” అని వెల్లడించింది. పార్వతి మాటలు ఇప్పుడు కోలీవుడ్, మల్లూవుడ్ లో సంచలనంగా మారాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












