Jana Gana Mana: ఆ రీజన్ వల్లే మహేష్ జనగణమనకు నో చెప్పారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలు తెరకెక్కగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నా వేర్వేరు కారణాల వల్ల ఈ కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలెక్కలేదు. అయితే దర్శకుడు పూరీ జగన్నాథ్ మహేష్ బాబును దృష్టిలో ఉంచుకుని జనగణమన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు.

Click Here To Watch NOW

చాలా సంవత్సరాల క్రితమే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైనా మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం మహేష్ బాబు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో జనగణమన సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. కొన్నిరోజుల క్రితమే విజయ్ హీరోగా జనగణమన తెరకెక్కుతున్నట్టు వార్తలు వచ్చినా తాజాగా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదలైంది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

2023 సంవత్సరం ఆగష్టు 3వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. పూరీ జగన్నాథ్ విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ ఈ ఏడాది ఆగష్టు 25వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దేశ భక్తి, ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో జనగణమన తెరకెక్కనుంది. అయితే రిస్కీ సబ్జెక్ట్ కావడం వల్లే మహేష్ ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపకపోయి ఉండవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జనగణమన విషయంలో మహేష్ నిర్ణయం రైటో రాంగో తెలియాలంటే ఏడాదిన్నర వరకు ఆగాల్సిందే. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరీ జగన్నాథ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తుండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus