Nagarjuna: ఓటీటీల గురించి నాగ్ ఊహించిందే కరెక్ట్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. టికెట్ రేట్ల గురించి ఆ సమయంలో నాగార్జునకు ప్రశ్నలు ఎదురు కాగా ఏపీలో తగ్గించిన టికెట్ రేట్లకు అనుగుణంగానే బంగార్రాజు సినిమా తెరకెక్కిందని టికెట్ రేట్లు తనకు సమస్య కాదని నాగార్జున ఆ సమయంలో వెల్లడించారు. ప్రస్తుతం సినిమాల పరిస్థితి చూస్తే నాగార్జున చెప్పిందే నిజమవుతుంది. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఎక్కువ సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచాయి.

మరికొన్ని సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు. బంగార్రాజు రిలీజ్ సమయంలో నాగ్ టికెట్ రేట్లను పెంచడం వల్ల థియేట్రికల్ మార్కెట్ దెబ్బ తినే అవకాశం అయితే ఉందని కామెంట్లు చేశారు. థియేట్రికల్ మార్కెట్ దెబ్బ తింటే ఆ ప్రభావం హీరో, నిర్మాత, ఇతర అంశాలపై పడుతుందని నాగ్ చెప్పారు. నాగ్ మాటలే ఇప్పుడు నిజమయ్యాయి. పెద్ద సినిమాల టికెట్లను సాధారణ రేట్లకే అమ్ముతున్నామని నిర్మాతలు ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అదే సమయంలో తమ సినిమా ఓటీటీలో ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుందని ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది. నాగార్జున ఓటీటీ గురించి మాట్లాడుతూ ఓటీటీ థియేటర్ కు సమాంతరంగా నడవాలని థియేటర్ కు ఓటీటీ ప్రత్యామ్నాయం కాకూడదని చెప్పారు. థియేటర్ ను వదిలేసి ఓటీటీలో సినిమాను చూసే పరిస్థితి రాకూడదని ఆయన వెల్లడించారు. పెద్ద సినిమాలకు టికెట్ రేట్లను భారీగా పెంచడం వల్ల సినిమాలకు నష్టమే తప్ప లాభం జరగడం లేదు.

పెద్ద సినిమాల నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. టికెట్ రేట్లను పెంచుకుంటూ వెళితే మాత్రం రాబోయే రోజుల్లో థియేటర్లలో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య మరింత తగ్గే ఛాన్స్ అయితే ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus