ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) – దీపిక పడుకొణె (Deepika Padukone) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) . మామూలుగా అయితే ఇలా కాకుండడా మరో నెల రోజుల్లో విడుదల కానున్న చిత్రం అని చెప్పాలి. అయితే సినిమా రిలీజ్ విషయంలో చిత్రబృందం సందిగ్ధంలో ఉంది అనే వార్తలు వస్తున్న తరుణంలో అలా చెప్పలేకపోతున్నాం. గత రెండు రోజులుగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అయితే… సినిమా కొత్త రిలీజ్ డేట్, రిలీజ్ విషయంలో ఆలస్యం ఎందుకు అనే అంశాల్లో క్లారిటీ వచ్చేస్తుంది.
వైజయంత్రి మూవీస్‌కు బాగా నచ్చిన డేట్, అచ్చొచ్చిన తేదీ అయిన మే9న సినిమాను రిలీజ్ చేస్తాం అని ఆ మధ్య ఘనంగా అనౌన్స్ చేశారు. అదే జరిగే అవకాశం ఉంటే ఈ పాటికి సినిమా ప్రచారం ఉవ్వెత్తున ఎగిసిపడే అలలాగా సాగాలి. కానీ ఇప్పటివరకు అలాంటి సూచనలు కనిపించడం లేదు. ఈ సినిమాకు ఏది వారమో, రెండు వారాలో ప్రచారం చేస్తే సరిపోదు. ఆ లెక్కన మే 9న సినిమా రాదు అని చెప్పేయొచ్చు.
అయితే కొత్ పుకార్ల ప్రకారం అయితే మే ఆఖరిలో సినిమాలో రావొచ్చు అంటున్నారు. అవును మే9 కాకపోవచ్చు కానీ… మేలోనే సినిమా వస్తుంది అని అంటున్నారు. ఎప్పటి నుండో ప్లానింగ్ కదా.. ఈ సమస్య ఇప్పుడెందుకు వచ్చింది అనే ప్రశ్న వస్తే… అతిథి పాత్రలే కారణం అని సమాధానం వస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా తారక్, కృపాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు అందులో తారక్ అందుబాటులో ఉండడు అంటున్నారు.
దీంతో పరశురాముడి పాత్ర కోసం నాగార్జునను (Nagarjuna) సంప్రదించారు అని చెబుతున్నారు. మరి ఆయన ఓకే అంటే… ఆ సన్నివేశాలు పూర్తి చేసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తారని సమాచారం. అలాగే సినిమా రిలీజ్ డేట్ చెబుతారు అని కూడా అంటున్నారు. ఉగాది పోస్టర్‌లో ‘మే నెల విడుదల’ అనే కొత్త ట్రెండ్ పోస్టర్ పడుతుంది అని అంటున్నారు.