Devara: దేవర డిజిటల్ రైట్స్ ఆ రేంజ్ లో అమ్ముడయ్యాయా.. ఎన్ని రూ.కోట్లంటే?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తైంది. ఫిబ్రవరి నెల చివరి వారం నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తైందని సమాచారం అందుతోంది. దేవర డిజిటల్ హక్కులు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. దేవర సినిమా నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దేవర గ్లింప్స్ కు ఇప్పటివరకు 33 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వ్యూస్ తెలుగు వెర్షన్ వ్యూస్ కాగా ఇతర భాషల్లో సైతం దేవర గ్లింప్స్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయని సమాచారం అందుతోంది. దేవర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతం కావడం గమనార్హం. కొరటాల శివ కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో ప్రతి సీన్ వేరే లెవెల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.

దేవర (Devara) గ్లింప్స్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ వేరే లెవెల్ లో ఉంది. ఈ సినిమాలో తారక్ మరో లుక్ లో కూడా కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర1 క్లైమాక్స్ షాకింగ్ ట్విస్ట్ తో ముగియనుందని సమాచారం. సరికొత్త బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవర మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి లాభాలను అందిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

దేవర2 మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. దేవర మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి. దేవర సినిమా రిలీజ్ కు మరో 80 రోజుల సమయం మాత్రమే ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus