మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా థియేటర్లలో విడుదలై 20 సంవత్సరాలైంది. అయితే మెగాస్టార్ అభిమానులు మాత్రం ఈ సినిమాను తేలికగా మరిచిపోలేరు. బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం. ప్రొడ్యూసర్ ఆశ్వనీదత్ ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించడం గమనార్హం. ఇంద్ర కథ విన్న బి.గోపాల్ చిరంజీవితో ఫ్యాక్షన్ సినిమా చేయడం సరైన నిర్ణయమేనా? అని సందేహం వ్యక్తం చేశారు.
అంతకుముందు బి.గోపాల్ మెకానిక్ అల్లుడు సినిమాను చిరంజీవితో తెరకెక్కించినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. ఇంద్ర సినిమాను చిరంజీవితో తీయకూడదని బి.గోపాల్ భావించగా పరుచూరి గోపాలకృష్ణ ఎంతో కష్టపడి ఆయనను ఒప్పించారు. అలహాబాద్ లో ఇంద్ర మూవీ షూట్ జరుగుతున్న సమయంలో చిరంజీవి కథ ప్రకారం మేనల్లుడి కొరకు నేను దెబ్బలు తింటున్నానని అయితే ఫ్యాన్స్ ఆ సన్నివేశాన్ని ఒప్పుకుంటారా అని పరుచూరి బ్రదర్స్ ను ప్రశ్నించారు.
ఆ సమయంలో పరుచూరి బ్రదర్స్ “తప్పు నా వైపు ఉంది కాబట్టి తల వంచుకుని వెళుతున్నానని లేకపోతే తలలు తీసుకెళ్లేవాడిని” అనే డైలాగ్ ను పెట్టారని సమాచారం. ఇంద్ర మూవీలో రాయలసీమకు తిరిగొచ్చిన తర్వాత ఉండే సన్నివేశాలకు సైతం పవర్ ఫుల్ డైలాగ్స్ ఉండాలని చిరంజీవి కోరగా విలన్ ముఖేష్ రుషిని కొట్టిన తర్వాత “నరుక్కుంటూ వెళితే అడవి అనేది మిగలదని చంపుకుంటూ వెళ్తే మనిషి అనేవాడు మిగలడు” అని చెప్పిన డైలాగ్ బాగా పేలింది.
యూట్యూబ్ లో ఇంద్ర సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. నిర్మాతకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.