Ravi Teja , Puri Jagannadh: రవితేజ, పూరీ అమ్మ అని పిలిచే ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

రవితేజ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే కాంబినేషన్లలో ఒకటి. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు అంచనాలను మించి ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. అయితే ఈ కాంబోలో వచ్చిన నేనింతే, దేవుడు చేసిన మనుషులు సినిమాలు మాత్రం ఆశించిన రెస్పాన్స్ ను సొంతం చేసుకోకపోవడం గమనార్హం. అయితే పూరీ జగన్నాథ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ అనుష్క గురించి ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.

స్టార్ హీరోయిన్ అనుష్క చాలా మంచి అమ్మాయి అని ఈ విషయం అందరూ చెబుతారని పూరీ జగన్నాథ్ అన్నారు. అనుష్క దగ్గర చాలా నేర్చుకోవాలని ఆయన కామెంట్లు చేశారు. రవితేజ, ఛార్మి, నేను అనుష్కను అమ్మ అని పిలుస్తామని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. కలిసినప్పుడల్లా అనుష్క కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటామని ఈ విషయాలు నిజమో కాదో అనుష్కను అడగాలని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) గతంలో ఒక సందర్భంలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ అనుష్క వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అనుష్క తెలుగులో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. చిరంజీవి వశిష్ట కాంబో మూవీలో అనుష్క పేరు వినిపిస్తున్నా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఈ ఏడాది విజయాన్ని సొంతం చేసుకున్న అనుష్క తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

అనుష్క రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. 2024 సంవత్సరం అనుష్కకు కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనుష్క కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus