‘‘మా తాత చనిపోతే సొంత ఇల్లు లేని కారణంగా అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బంది ఎదురైంది. దీంతో రాత్రికి రాత్రే ఆంధ్రప్రదేశ్‌లోని మా గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చింది’’ అంటూ ఈ మధ్య చెప్పారు ‘కేజీయఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ప్రశాంత్‌ది ఏపీనా.. ఎక్కడ? అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఈ వివరాలను ప్రముఖ మీడియా సంస్థ బయటకు తీసుకొచ్చింది. వాటి ప్రకారం ప్రశాంత్ నీల్‌ది ఒకప్పటి అనంతపురం జిల్లా, ఇప్పటి శ్రీసత్యసాయి జిల్లా.
‘కేజీయఫ్’ ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్ నీల్ తాను తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తినే అని చెప్పారు. అంతే కాదు ‘కేజీయఫ్ 2’లో హీరో తన తల్లి సమాధిని అమాంతం తీసుకు వచ్చి సొంత ఇలాఖాలో పెట్టేసుకుంటాడు. అసలు ఆ ఆలోచన తన జీవితంలోంచి వచ్చిందే అని కూడా చెప్పారు ప్రశాంత్. కొన్నేళ్ల క్రితం తన తాత చనిపోతే సొంత ఇల్లు లేని కారణంగా అంత్యక్రియలు చేయడానికి ఇబ్బంది ఎదురయిందని, దాంతో రాత్రికి రాత్రి ఏపీలోని తమ గ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.
జీవితంలో బాగా సంపాదించి, స్థిరపడిన తర్వాత అలాగే తనకు ఎంతో ఇష్టమైన తన తాత సమాధిని… తెచ్చుకోవాలనుకున్నానని చెప్పారు ప్రశాంత్ నీల్. అయితే అది తనకు సాధ్యం కాలేదు కాబట్టి, ఆ ఆలోచనను సినిమాలో పెట్టానని చెప్పారు. దీంతో ఆయన ఏ ప్రాంతానికి చెందినవారు అని వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు. ఈ క్రమంలో ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామానికి చెందిన వారని తెలిసిందట. పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్వగ్రామం నీలకంఠాపురమే.
‘కేజీయఫ్’ రెండు సినిమాల విజయంతో ఆ ప్రాంత వాసులు ఆనందపడుతున్నారట. తమ ప్రాంతవాసి ఇలాంటి గొప్ప సినిమా చేయడం ఆనందంగా ఉంది అని చెబుతున్నారు ఆ ప్రాంత వాసులు అంతేకాదు ఇనాయత్ ఖలీల్‌గా ‘కేజీయఫ్ 2’లో కనిపించిన బాలకృష్ణ కూడా ప్రశాంత్ నీల్‌కి బంధువే అని సమాచారం.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!