సోషల్ మీడియాలో ఏ మూల చూసినా ఇప్పుడు ‘నాటు… నాటు..’ సందడే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుండి ఇటీవల విడుదలైన సింగిల్ ఇది. ఇందులో టాలీవుడ్‌లోనే బెస్ట్ డ్యాన్సర్స్‌లో ఇద్దరు ఆడిపాడారు. ఆ హుక్ స్టెప్ అయితే మన కుర్రాళ్లు తెగ ట్రై చేస్తున్నారు. అద్భుతంగా వచ్చినవాళ్లు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి వైరల్ అయిపోతున్నారు. మిగిలిన వాళ్లు ఇంకా ట్రై చేస్తున్నారు. మరి అంతటి సూపర్బ్ సాంగ్‌ని రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఎలా ప్రాక్టీస్ చేశారు? తెలుసుకుదాం!
మామూలుగా అయితే మన కుర్ర స్టార్ హీరోలు కొరియోగ్రాఫర్లు చేసిన డెమో వీడియోలు చూసి ప్రాక్టీస్ చేస్తుంటారు. సెట్స్‌పైకి వచ్చి ఒకటి, రెండుసార్లు చూసుకొని టేక్‌లోకి వెళ్లిపోతుంటారు. మన హీరోలు డ్యాన్స్‌ల విషయంలో పక్కానే. రామ్‌చరణ్, తారక్ కూడా అంతే. చాలా సినిమాలకు ఇలానే చేసేవారట. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ విషయంలో కొంచెం డిఫరెంట్‌గా సాగిందట. అందులోనూ ‘నాటు నాటు’ పాట విషయంలో ఇంకాస్త. మనం ఇప్పటికే ఈ పాటను చూశాం. అందులో చరణ్, తారక్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.
అంతబాగా పాట రావాలని ఇద్దరూ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ స్టూడియోలో ప్రాక్టీస్ సెషన్‌కి హాజరయ్యారట. డ్యాన్స్‌లో టైమింగ్, మూమెంట్స్‌లో గ్రేస్ కనిపించేందుకు వారం పాటు ప్రాక్టీస్ చేశారని తెలుస్తోంది. అందుకేనేమో పాటలో ఇద్దరి మధ్య కోఆర్డినేషన్, బ్రొమాన్స్ అంతగా వర్కవుట్ అయ్యింది.