చిన్నతనంలో పులి – మేక కథ ఎవరైనా చెబుతుంటే… మనం చాలా ఆసక్తికరంగా వినేవాళ్లం. ఇప్పుడంటే అలాంటి కథలు యూట్యూబ్ చెబుతోంది అనుకోండి. తెలుగు సినిమా హీరో – విలన్ పోరాటానికి అప్పటి పులి -మేక కథను లింక్ చేసి ‘పుష్ప 1’ తొలి సింగిల్ తీసుకురాబోతున్నారా? అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు. ఈ నెల 13న విడుదల కాబోతున్న తొలి సింగిల్ ‘కెవ్వు కేక’ పెట్టిస్తుంది అంటున్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ‘దాక్కో దాక్కో మేక…
పులొచ్చి కొరుక్కుద్ది పీక…’ పాటను ఐదు భాషల్లో విడుదల చేస్తారు. తెలుగు వరకు అయితే శివమ్ అనే గాయకుడు ఆలపిస్తాడు. ఇక కొత్తగా బయటికొచ్చిన విషయాలు చూస్తే… సినిమాలో ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాస్టర్ తీర్చిదిద్దారు. బన్నీ స్టైల్‌కు గణేశ్ ఆచార్య మాస్టర్ స్టెప్పులు తోడై పాట అద్భుతంగా వచ్చిందంటున్నారు. ఇక సుకుమార్ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎప్పటిలాగే ఈ పాట టేకింగ్ ఒక లెవెల్లో ఉంటుందంటున్నారు. అటవీ నేపథ్యంలో, భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టుల నడుమ పాటను తెరకెక్కించారట. పాటకు నిర్మాతలు ఏకంగా రెండు నుండి మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. చూద్దాం… 13న పుష్పరాజ్ యూట్యూబ్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో.