మాటల మాంత్రికుడు త్రివిక్రమ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న సినిమా అలా మొదలైందో లేదో.. ఇలా ఆ చిత్రానికి సంబంధించిన విషయాలు బయటికి వచ్చేస్తున్నాయి. త్రివిక్రమ్ గత చిత్రాలైన అత్తారింటికి దారేది. అ ఆ చిత్రాలలో ఆనాటి హీరోయిన్స్ నదియా, స్నేహాలు క్యారక్టర్ ఆర్టిస్టులుగా నటించారు. ప్రస్తుతం పవన్ తో చేస్తున్న సినిమాలోనూ కుష్బూ కి మంచి పాత్ర ఇచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది. ఆనాటి హీరోయిన్స్ తో సన్నివేశాన్ని పండించడమనే సెంటిమెంట్ ని ఎన్టీఆర్ చిత్రానికి కూడా కొనసాగించనున్నట్లు సమాచారం. అయితే ఎవరిని తీసుకోవాలో అనే దానిపై త్రివిక్రమ్, ఎన్టీఆర్ చర్చిస్తున్నట్లు తెలిసింది..
ఇదివరకు పరిచయం అయిన వారు కాకుండా టబు కి కీలక రోల్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు ఫిలిం నగరవాసులు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ మాత్రం సోనాలి బింద్రే అయితే బాగుంటుందని సూచినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్తగా కనిపించనున్నారు.