Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

ఈ మధ్య కాలంలో వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. సమ్మతమే సినిమాతో యావరేజ్ రిజల్ట్ అందుకున్న కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో సెప్టెంబర్ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా కిరణ్ అబ్బవరం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట విడుదలైంది.

“నేను అట్టాంటిట్టాంటి దాన్ని కాదు మావా” అనే లిరిక్స్ తో సాగే ఈ పాటలో ఆటకావాలా పాట కావాలా సాంగ్ తో పాటు చిలకపచ్చ కోక సాంగ్ కూడా వినిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కిరణ్ అబ్బవరం ప్లాన్ వర్కౌట్ అయ్యి చిరంజీవి, బాలయ్య అభిమానులు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తారేమో చూడాల్సి ఉంది. చిరంజీవి, బాలయ్య సాంగ్స్ వినిపించే సమయంలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం తెలుగు టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడీగా సంజన ఆనంద్ నటించగా కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. యూట్యూబ్ లో ఈ సాంగ్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన మణిశర్మ సంగీతం అందించారు. కిరణ్ అబ్బవరం సినిమాలన్నీ పరిమిత బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ప్రముఖ బ్యానర్లలోనే కిరణ్ అబ్బవరం సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం.

క్రేజ్ ఉన్నా పరిమితంగా పారితోషికం తీసుకుంటూ ఉండటంతో కిరణ్ అబ్బవరంకు ఛాన్స్ ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. సినిమాసినిమాకు కిరణ్ అబ్బవరంకు క్రేజ్ పెరుగుతుండగా కిరణ్ అబ్బవరం తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus