ప్రస్తుత సమాజంలో ఆడవాళ్ళ కోసం రక్షణ కోసం, వారి అభ్యున్నతి కోసం లెక్కలేనన్ని చట్టాలున్నాయి. ఆ చట్టాలను కొందరు తమ ప్రగతి కోసం వినియోగించుకోంటుంటే.. ఇంకొందరు మాత్రం మగాళ్లను అణగదొక్కడానికి వాడుకొంటుంటారు. అందుకే మగాళ్ళకి కూడా రక్షణ చట్టాలను తీసుకురావాలని చాలా మంది మగాళ్లతోపాటు కొందరు మహిళలు కూడా పోరాడుతూనే ఉన్నారు. అయితే.. ఆ పోరాటం పెద్దగా ప్రాముఖ్యత సంపాదించుకోలేదు. ఈ నేపధ్యంలో వచ్చిన చిత్రమే “ఐపీసీ సెక్షన్ భార్యాబంధు”.
గత సూక్రవారం విడుదలైన 9 తెలుగు చిత్రాల్లో ఒకటిగా విడుదలైన ఈ చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. చూసిన కొందరు మాత్రం సినిమా చాలా బాగుంది అంటూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. రెట్టాడి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిన్న సినిమాలో సీనియర్ నటీమణి ఆమని కూడా కీలకపాత్ర పోషించడం విశేషం. కాస్త నోటెడ్ ఆర్టిస్టులు ఉండి ఉంటే సినిమాకి ఇంకాస్త ఎక్కువ రీచ్ ఉండేదని భావిస్తున్నారు సినిమా చూసినవాళ్ళందరూ. కానీ.. ఇలాంటి చిన్న కంటెంట్ బేస్డ్ మూవీస్ ఆడితేనే ఈ తరహాలో మరిన్ని సినిమాలు వస్తాయి.