ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం తగ్గించారు. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే.కొంతమంది పెరిగిన టికెట్ రేట్లతో థియేటర్లకు రావడం మానేస్తున్నారు. ఇంకొంత మంది వీకెండ్ మిస్ అయితే ‘ఇక ఓటీటీలో చూసుకోవచ్చులే’ అని బాగున్న సినిమాలను కూడా థియేటర్లలో చూడటం మానేసి లైట్ తీసుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే.. పీవీఆర్, ఇనాక్స్ వంటి సంస్థలు ‘మూవీ పాస్ పోర్ట్’ ని ప్రవేశ పెట్టాయి.
రూ.349 లతో ఈ పాస్ తీసుకుంటే నెలకు 4 సినిమాలు ఫ్రీగా చూడొచ్చు. అంటే ఆన్లైన్ బుకింగ్స్ లో వాటికి టాక్సులు, జీ.ఎస్.టి..లు వంటివి పడతాయి అనుకోండి. అయినప్పటికీ ఒక్కో సినిమాని వంద రూపాయల లోపే చూడొచ్చు. ఈ ఆఫర్ ను కేవలం సోమవారం నుండి గురువారం వరకు మాత్రమే పెట్టాయి ఈ సంస్థలు. అందులో కూడా గురువారం రిలీజ్ అయ్యే పెద్ద ‘సినిమాలకి ఈ ఆఫర్ వర్తించదు’ అని కొత్త రూల్ పెట్టాయి ఈ సంస్థలు.
అది కూడా ఈ మధ్యనే. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ ( The GOAT) నుండి ఈ షరతులు పెట్టారు. అయితే ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) సినిమాకి మాత్రం ఈ ఆఫర్ పెట్టలేదు.ఆ సినిమా జూన్ 27 గురువారం రోజున విడుదల చేయడం జరిగింది. ఆ సినిమాకు రూ.400 టికెట్ రేటుని పూర్తిగా తీసేసి టాక్సులు మాత్రమే వసూల్ చేశారు. చాలా మంది రూ.39కే ఆ సినిమాని చూశారు. అయితే తాజాగా వచ్చిన ‘పుష్ప 2’ కూడా గురువారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
దీనికి మాత్రం మూవీ పాస్ పని చేయలేదు. కేవలం గురువారం రోజున మాత్రమే కాదు, వీక్ డేస్ లో కూడా ఈ పాస్ తో ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ని చూడలేము. రెండు నెలల ముందు వచ్చిన ‘దేవర’ కి కూడా ఈ పాస్ పనిచేయలేదు. సో ఈ పాస్ పనిచేయకపోవడం వల్ల ‘పుష్ప 2’ ‘దేవర’ (Devara) వంటి సినిమాలకి బాగా కలిసొచ్చింది. కానీ ‘కల్కి 2898 ad’ సినిమాకి ఇలా చేయకపోవడం వల్ల రూ.100 కోట్లకి పైగా వసూళ్లు తగ్గినట్లు సమాచారం.