Bimbisara: హిట్‌ సినిమా ‘బింబిసార’ సీక్వెల్‌పై కల్యాణ్‌ రామ్‌ కామెంట్స్‌… వింటుంటే?

కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌ హిట్‌ సినిమాలే ఎప్పుడో ఎండా కాలంలో వర్షాల్లా వస్తుంటాయి. అదే బ్లాక్‌బస్టర్లు అయితే ఇంకా కష్టం. అలాంటి కొన్ని సినిమాల్లో ‘బింబిసార’ ఒకటి. ఎవరూ ఊహించని, కల్యాణ్‌ రామ్‌ నుండి అస్సలు ఎక్స్‌పెక్ట్‌ చేయని కాంబినేషన్‌, కథ – కథనంతో వచ్చిన ఆ సినిమా భారీ విజయం అందుకుంది. కల్యాణ్‌ రామ్‌లోని వెర్సటైల్‌ యాక్టర్‌ను తెలుగు చలన చిత్ర సీమకు పరిచయం చేసిన సినిమా అది. ఇప్పుడు ఈ సినిమా గురించి చర్చ ఎందుకు అనుకుంటున్నారా? ఈ సినిమా రెండో పార్టు ఏమైంది అనే ప్రశ్న రావడమే.

‘డెవిల్‌’ సినిమా ప్రచారంలో భాగంగా హీరో కల్యాణ్‌ రామ్‌ దగ్గర ‘బింబిసార 2’ గురించి ప్రస్తావిస్తే… సినిమా లేదు అని చెప్పలేదు కానీ, వివరాలు అయితే సరిగ్గా ఇవ్వలేదు. ‘కొత్త సినిమా ఇటీవలే ప్రారంభించాం. అదయ్యాక ‘బింబిసార 2’ ఉంటుంది’ అని చెప్పారు కల్యాణ్‌ రామ్‌. దీంతో అసలు ‘బింబిసార 2’ ఉంటుందా? అనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే తలి సినిమా వచ్చిన వెంటనే కాకపోతే కొన్ని రోజులకు రెండో పార్ట్‌ రావాలి. ఆలస్యమైతే ఆగిపోయినట్లే అని అంటుంటారు.

‘బింబిసార’ (Bimbisara) సినిమా రిలీజ్‌ సమయంలోనే ఈ సినిమాకు పార్ట్‌ 2 ఉంటుందని చిత్రబృందం చెప్పేసింది. అనుకున్నట్లే తొలి పార్టు ముగింపు కూడా అలానే ఉంటుంది. దీంతో రెండో పార్టు షూటింగ్‌ వెంటనే ప్రారంభించేస్తారు అనుకున్నారు. దర్శకుడు మల్లిడి వశిష్ఠ కూడా ఇలానే చెప్పారు. సినిమా షూటింగ్‌ లొకేషన్ల రెక్కీ కూడా మొదలుపెట్టారు. దానికి సంబంధించిన ఓ ఫొటోను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కానీ ఏమైందో ఏమో సినిమా నుండి వశిష్ట తప్పుకున్నారు.

కొత్త కథను సిద్ధం చేసుకుని వశిష్ట ఇతర హీరోలకు కథలు చెబుతున్నారని వార్తలు వచ్చాయి. వాటిని ఎవరూ ఖండించకపోవడంతో నిజమే అనుకున్నారు. పుకార్లకు తగ్గట్టే వశిష్ట తన కథలను బాలకృష్ణ, చిరంజీవి లాంటివాళ్లకు వినిపించారు. ఆఖరిగా చిరంజీవితో ‘విశ్వంభర’ (ఇంకా ఖరారు చేయలేదు) సినిమా అనౌన్స్‌ చేసి, షూటింగ్‌ మొదలుపెట్టేశారు. దీంతో ‘బింబిసార 2’కి కెప్టెన్‌ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు అయితే అసలు ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus