భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత భారత క్రికెటర్లు కొంతమంది రామ్‌చరణ్ ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు అని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ ఎలాంటి సమాచారం లేదు. కానీ కొన్ని ఫొటోలు అయితే బయటకు వచ్చాయి. అందులో రామ్‌చరణ్ ఎక్కడా కనిపించకపోయినా.. క్రికెటర్లతో అభిమానులు మాత్రం కనిపిస్తున్నారు. దీంతో అసలు రామ్‌చరణ్ ఇంటికి క్రికెటర్లు వెళ్లారా? వెళ్తే ఎందుకు అధికారికంగా ఫొటోలు రిలీజ్ చేయలేదు అనే చర్చ మొదలైంది.
26వ తేదీ ఉదయం ట్విటర్‌లో ఓ ఫొటో కనిపించింది. అందులో హార్దిక్ పాండ్యతో ఓ యువకుడు ఉన్నాడు. ఆ ఫొటోలో ఉన్న రామ్‌చరణ్ ఇల్లేనా అనేది తెలియదు. అయితే ఫొటోను షేర్ చేసినవ్యక్తి ‘హార్దిక్ పాండ్య గత రాత్రి రామ్‌చరణ్ ఇంటికి వచ్చాడని, అక్కడ దిగిన ఫొటో ఇదని’ రాసుకొచ్చాడు. దీంతో భారత క్రికెటర్లు రామ్‌చరణ్ ఇంటికి వెళ్లారా? అంటూ ఓ చర్చ మొదలైంది. మరికొందరైతే చరణ్ టీమ్ నుండి ఫొటోలు వస్తాయిలే అప్పుడు చూద్దాం అనుకున్నారు.
కానీ ఇది జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఇటు చరణ్ టీమ్ నుండి కానీ, హార్దిక్ పాండ్య నుండి కానీ ఎలాంటి సమాచారం కానీ, ఫొటోలు కానీ బయటకు రాలేదు. దీంతో అసలు రామ్‌చరణ్ ఇంటికి హార్దిక్ పాండ్య వెళ్లాడా లేదా అనే ప్రశ్న మొదలైంది. ఒకవేళ వెళ్లకపోతే ఆ అభిమాని అలా ఎందుకు రాశాడు అనేది మరో ప్రశ్న. నేను నా అభిమాన క్రికెటర్‌ని కలిశాను అని రాస్తే సరిపోయేదానికి.. చరణ్ ఇంటికి పాండ్య వచ్చాడు అని ఎందుకు రాసినట్లో తెలియడం లేదు.
ఒకవేళ చరణ్, పాండ్య స్నేహితులా అంటే.. గతంలో ఇద్దరూ ఎక్కడా కలిసినట్లు లేదు కూడా. పోనీ క్రికెటర్లందరూ వెళ్లారా అంటే.. ఆ ఫొటోలు ఎక్కడా బయటకు రాలేదు. దీనిపై చరణ్ టీమ్ నుండి ఏదైనా క్లారిటీ వస్తే బాగుండు. లేదంటే ఏమైంది అంటూ తలల కొట్టుకుంటున్నారు అభిమానులు. ఎందుకంటే పాండ్యతో చరణ్ కలసిన పిక్ వస్తే వారికి పండగే కాబట్టి.