ప్రభాస్ ‘మిర్చి’ సినిమా వచ్చిన తొలి రోజుల్లో.. వినిపించిన మాట ‘ఇది గోపీచంద్ ‘శంఖం’ సినిమాలా ఉందే?’ అని. ఆ రోజుల్లో దీని గురించి పెద్దగా చర్చ జరగలేదు. దీనికి కారణం ‘శంఖం’ సినిమా ఫ్లాప్, ‘మిర్చి’ హిట్ కాబట్టి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మరో గోపీచంద్ సినిమా ఇలానే గోపీచంద్ సినిమా పోలికలతో ఉండటమే. విశ్వక్‌సేన్ హీరోగా రూపొందిన ‘దమ్కీ’ సినిమా గురించే ఇదంతా. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఆ ట్రైలర్‌ను చూసిన చాలామంది ఇది గోపీచంద్ సినిమా ‘గౌతమ్ నంద’ సినిమాలా ఉందే అని అంటున్నారు. ట్రైలర్ మాత్రమే చూసి ఎలా చెప్పేస్తారు అని డౌట్ రావొచ్చు. ఆ సినిమాలోని హీరో పాత్రలు, ఈ సినిమాలో హీరో పాత్రలు ఒకేలా ఉండటమే కారణం అంటున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ‘గౌతమ్ నంద’ రిఫరెన్సులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి అని నెటిజన్లు అంటున్నారు. ‘గౌతమ్ నంద’ సినిమాలోలో ఇద్దరు గోపీచంద్‌లు ఉంటారు.
ఆ సినిమాలో ఒక గోపీచంద్ ధనవంతుడు.. ఇంకోకడు మిడిల్ క్లాస్ కుర్రాడు. అనుకోకుండా ధనవంతుడి ప్లేస్‌లోకి మిడిల్ క్లాస్ గోపీచంద్ వెళ్తాడు. దీంతో అక్కడి నుండి సినిమా కథ మారిపోతుంది. సేమ్ టూ సేమ్.. ఇప్పుడు విశ్వక్‌సేన్ ‘దమ్కీ’ సినిమా కథ కూడా ఇంతే అంటున్నారు. ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరు రాజు, ఇంకొకరు పేదవాడు. ఆ సినిమాలాగే ఇందులో కూడా ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్తారు. అలా వెళ్లాక ఏం జరిగిందన్నదే ‘దమ్కీ’ కథ.
దీంతో రెండు సినిమాల కథలూ ఒకటే అంటున్నారు. అయితే ట్రీట్‌మెంట్‌లో తేడా ఉంటుంది అనుకోండి. మరి ‘దమ్కీ’ ట్రీట్‌మెంట్ బాగుంటే సినిమా హిట్టే. గతంలో ఇలానే వార్తలొచ్చిన ‘మిర్చి’ హిట్ అయినట్లే.. ఇప్పుడు ‘దమ్కీ’ కూడా హిట్ అవుతుందా అనేది చూడాలి. అయితే ట్రైలర్ చూసి అనుకుంటున్న ఈ పోలికలు సినిమాలు ఉంటాయా అనేది వేరే మాట.