ప్రముఖ నిర్మాత దిల్ రాజు చూపు రాజకీయాలవైపు వెళ్తోందా? త్వరలో ఆయన ఏదో పొలిటికల్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. తెలుగు సినిమా పరిశ్రమలో గత కొద్ది రోజులుగా ఈ మేరకు పుకార్లు వినిపిస్తున్నాయి. తొలి రోజుల్లో ఓ తెలుగు నిర్మాత రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ వార్తలొచ్చాయి. అయితే అది దిల్ రాజే అని ఇప్పుడు అంటున్నారు. ఈ మేరకు ఆయన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని సమాచారం. అయితే నేరుగా ఎన్నికల బరిలో దిగుతారా? లేక పెద్దల సభకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.
దిల్ రాజు పంపిణీ రంగం నుండి ప్రారంభించి నిర్మాతగా మారి, ఇప్పుడు భారీ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. వరుసగా పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మరోవైపు సొంత ప్రాంతం నిజామాబాద్‌లో ఓ దేవాలయం నిర్మించి, ఆ నేపథ్యంలో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్లింది అని.. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో మరింతగా ప్రజల్లోకి వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మీద మాత్రమే కాకుండా మొత్తంగా జిల్లా మీదే ఆయన దృష్టి పెట్టారని టాక్.
ఇదంతా చూస్తుంటే దిల్ రాజు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు అని ఓ వాదన బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి రెండు పార్టీల మధ్య నలిగిపోవాలని అనుకోవడం లేదని, అందుకే ఏదైనా పార్టీ నుండి రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. ఈ మేరకు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన తలచుకుంటే తెలంగాణలోని ఏ పార్టీ నుండైనా ఆయన బరిలోకి దిగొచ్చు.
రాజ్యసభ సీటే లక్ష్యం అయితే.. ఆయనకు బీఆర్‌ఎస్, బీజేపీ మాత్రమే ఆప్షన్లు. ఇక ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తే అక్కడ టీడీపీ, వైసీపీ కనిపిస్తున్నాయి. ఆయనకున్న పరిచయాలు ఈ నాలుగు పార్టీల్లో ఎవరో ఒకరి నుండి వెళ్లొచ్చు. అయితే సీరియస్‌గా ఆయన రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకుంటేనే ఇవన్నీ అనే సమాధానాలు వస్తున్నాయి. త్వరలోనే తెలంగాణ ఎన్నికలు, ఆ వెంటనే కేంద్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!