‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాకు సంబంధించి ప్రచారాన్ని టీమ్ బలంగా చేసుకుంటూ పోతోంది. రెండు సినిమాలను సంక్రాంతికి తీసుకొచ్చి కాస్త రిస్క్ చేస్తున్నా నిర్మాత దిల్ రాజు (Dil Raju) అయితే ప్లానింగ్ బలంగా చేసుకున్నారు. అందుకే రెండు ప్రచారాలు పారలల్‌గా సాగుతున్నాయి. అయితే ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సంబంధించి చెన్నైలో చేద్దామనుకున్న ఈవెంట్ రద్దు అయింది. ఈవెంట్ కాదు ఆ ఆలోచన రద్దయింది. దీంతో ఈ సినిమా టీమ్‌కు, లైకా ప్రొడక్షన్స్‌కు సమస్య వచ్చిందని అందుకే రద్దు చేశారు అంటూ ఏవేవో వార్తలు పుట్టుకొస్తున్నాయి.
దర్శకుడు శంకర్‌తో (Shankar) లైకా ప్రొడక్షన్స్‌కు ఉన్న ‘ఇండియన్’ (Indian 2) సమస్యలే దీనికి కారణం అని చెబుతున్నారు. అయితే సినిమా టీమ్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఈవెంట్‌కు సంబంధించిన పర్మిషన్ల విషయంలో సమస్యల వల్ల ఈవెంట్ ఆలోచనను రద్దు చేసుకున్నాం అని అంటున్నారు. తమిళనాడులో సినిమాను సుమారు 400 స్క్రీన్లలో రిలీజ్ చేసే దిశగా టీమ్ ప్లాన్ చేసుకుందని సమాచారం. ఈ క్రమంలో చరణ్‌ను (Ram Charan) తీసుకొచ్చి ఈవెంట్ చేస్తే.. శంకర్ మాట్లాడితే ఇంకా బాగుంటుంది అని అనుకున్నారు.
పాన్ ఇండియా సినిమాగా వస్తుంది కాబట్టి ఆ మాత్రం చేయాల్సిందే అనుకున్నారు. అక్కడ కూడా దిల్ రాజు ‘ఇరుక్కు’ స్పీచ్ చాలా ఫేమస్. అయితే అనుమతులు రాకపోవడంతో ఆగిపోయారట. అంతేకానీ ఇంకేం సమస్యలు లేవు అని టీమ్ చెబుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ‘ఇండియన్ 3’ సినిమా విషయంలో లైకా ప్రొడక్షన్స్ ఆగ్రహంతో ఉందని.. అందుకే ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌ను అడ్డుకుంది అని అంటున్నారు. నిజానికి గతంలో ‘ఇండియన్ 2’ సినిమా సమయంలో సమస్యలు అయితే ఉన్నాయి.
కానీ ఈ సినిమాను ఆపేసేంత సమస్యలు అయితే లేవు. ‘ఇండియన్ 3’ పూర్తి చేసి రిలీజ్ చేయాలని శంకర్ పట్టుదలతోనే ఉన్నారట. నిజానికి ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఇలాంటి పుకార్లు గత కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. హిందీ ‘బిగ్‌బాస్’కి వెళ్లి ప్రచారం చేసినా కియారా అడ్వాణీ ఇంకా సినిమా టీమ్‌కి దూరంగా ఉందని పుకార్లు పుట్టించారు. ఆమె వ్యక్తిగత కారణాలు, అనారోగ్యం వల్లనే ఈవెంట్లకు రావడం లేదు అని ఆమె టీమ్ మీడియాకు తెలిపింది.