Kalki: ‘కల్కి 2898’ ఆ హాలీవుడ్ సినిమాకి కాపీనా?.. ఏమైందంటే?

ప్రభాస్ గతేడాది చివర్లో ‘సలార్’ తో హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ప్రస్తుతం అతను ‘కల్కి 2898’ (‘ప్రాజెక్ట్ కె’) ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మేకర్స్ ఈ సినిమాని కచ్చితంగా సమ్మర్ కానుకగా మే 9 న విడుదల చేయాలని భావిస్తున్నారు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకి మే 9 సెంటిమెంట్ డేట్. అదే డేట్ కి ఆయన నిర్మాణంలో వచ్చిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ‘మహానటి’ బ్లాక్ బస్టర్స్ కాగా ‘మహర్షి’ కూడా సూపర్ హిట్ అయ్యింది.

అందుకే ‘కల్కి 2898 ‘ ని అదే డేట్ కి రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘కల్కి 2898 ‘ గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా కథ ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అంటూ చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటి అంటే.. (Kalki) ‘కల్కి 2898 ‘ కథ 2021 లో వచ్చిన ‘డునే’ అనే ఒక అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాని పోలి ఉంటుంది అంటున్నారు. వాస్తవానికి ఆ సినిమా ‘డునే’ అనే నవల ఆధారంగా రూపొందింది.బహుశా అదే నవల నాగ్ అశ్విన్ కూడా చదివి తన శైలిలో ‘కల్కి 2898 ‘ని రూపొందిస్తున్నాడేమో అని అంతా అనుకుంటున్నారు. అలాగే త్వరలో ‘డునే’ కి సీక్వెల్ కూడా రాబోతుంది.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus