Kiara Advani: నల్ల డ్రెస్‌ వెనుక అంత కథ ఉందా.. కియారా అందుకే వేసుకుందా?

గత రెండు రోజులుగా బాలీవుడ్‌ మీడియాలో, ఆ బ్యాచ్‌ సోషల్‌ మీడియాలో ఒకటే చర్చ.. కియారా అడ్వాణీ గర్భవతా? ఇదేం ప్రశ్న.. మొన్నీ మధ్యే కదా పెళ్లయింది అని అంటారా? అంటే ఆలియా భట్‌ – రణ్‌బీర్‌ కపూర్‌ సంగతి చూశాకా ఏ విషయం కరెక్ట్‌గా చెప్పలేకపోతున్నారు లెండి. పెండ్లికి బిడ్డను కనడానికి మధ్య ఉండాల్సినంత గ్యాప్‌ లేదు అని అప్పుడు అనుకున్నారు. ఆ విషయం వదిలేస్తే.. ఇప్పుడు కియారా గర్భవతా అనే ప్రశ్న రావడానికి కారణం మాత్రం విచిత్రంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ పుకార్లు రావడానికి కారణం కియారా ఇటీవల వేసుకున్న డ్రెస్‌.

కియారా అడ్వాణీ ఇటలీవల బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ డ్రెస్ ధరించింది. ఆ లుక్‌లో కియారా అదిరిపోయింది అంటూ కామెంట్స్‌ వినిపించగా మధ్యలో కొందరు మాత్రం ఈ డ్రెస్‌ సెంటిమెంట్‌ పట్టుకుని ఆమె గర్భవతినా అనే ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న కాస్త ప్రశ్నలుగా మారి, ఆ తర్వాత చర్చగా మారి.. చివరకు రచ్చగా మిగిలింది. ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు కియారా – సిద్ధార్థ్‌ మల్హోత్రా. వీరి వివాహం జరిగి మూడు వారాలు కూడా తిరగకుండానే, కియారా ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది.

ఇక్కడ కారణమేంటా అని చూస్తే.. బాలీవుడ్ సెలబ్రిటీలు కొంతమంది పోల్కా డాట్‌ డ్రెస్ స్టైల్‌లోనే ఉన్న డ్రెస్‌లు వేసుకునే తమ ప్రెగ్నెన్సీని ప్రకటిస్తూ వచ్చారు. అనుష్క శర్మ, అలియా భట్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, మీరా రాజ్ పుత్, నేహా ధూపియా, సానియా మీర్జా, లారా దత్తా .. ఇలా కొంతమంది నాయికలు తమ జీవితంలో గుడ్‌న్యూస్‌ను ఈ డ్రెస్‌లోనే చెప్పారు. దీంతో కియారా కూడా ప్రెగ్నెంట్‌ విషయం చెబుతుందేమో అనుకున్నారంతా.

గతంలో రణవీర్ సింగ్ ఇలానే పోల్కా క్యాస్టూమ్‌లో కనిపించినప్పుడు దీపికా పడుకునే పైనా మీమ్స్ వచ్చాయి. కట్రినా కైఫ్, కృతి సనన్, అనన్య పాండే, మలైకా అరోరా తదితర హీరోయిన్లు బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ డ్రెస్‌ ధరించడంపైనా మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు కియారా అడ్వాణీ మీద కూడా మీమ్స్ వచ్చాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus