Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌ కొత్త సినిమా ఏంటి? ఆ సినిమాలు లేవా?

టాలీవుడ్‌లో మోస్ట్‌ వల్నరబుల్‌ ప్లేస్‌ ఏదైనా ఉంది అంటే.. అది స్టార్‌ హీరోయిన్‌ స్టేటసే అని చెప్పాలి. ఎందుకంటే గురువారం రాత్రి వరకు ఉండే స్టార్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌.. శుక్రవారం వచ్చిన సినిమా తేడా కొడితే మాయమైపోతుంది. ఏంటీ.. ఒక్క సినిమాకే పరిస్థితి మారిపోతుందా? అని డౌట్‌ ఉందా? అయితే మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) సంగతి చూడండి మీకే తెలిసిపోతుంది. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) సినిమా ప్రచారం వరకు మృణాల్‌ ఠాకూర్‌ను అందరూ స్టార్‌ హీరోయిన్‌.. స్టార్‌ హీరోయిన్‌ అంటూ ఆకాశానికెత్తేశారు.

అగ్ర హీరోల సినిమాల్లో ఆమెను ఇన్‌స్టంట్‌ హీరోయిన్‌గా మాట్లాడేసుకున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌ (Prabhas) , చిరంజీవి (Chiranjeevi) అంటూ.. చాలామంది హీరోల సినిమాలో ఛాన్స్‌లు వచ్చాయని వార్తలొచ్చాయి. త్వరలో అనౌన్స్‌మెంట్‌ అనే మాట కూడా వినిపించింది. అయితే ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమాలు ఆమె లుక్‌.. గ్లామర్‌ అంత అట్రాక్టివ్‌గా లేదు అనే విమర్శలు వచ్చాయి. చూస్తుంటే కాస్త ‘ముదురు’ హీరోయిన్‌ అనే ట్యాగ్‌ వచ్చేసినట్లుంది. యంగ్‌ హీరోల పక్కన గ్లామర్‌ రోల్స్‌కి మృణాల్‌ అంతగా సూట్‌ అవ్వదు అనే జోకులు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఓకే అనుకున్న సినిమాల టీమ్‌లు పునరాలోచన చేస్తున్నాయని ఇప్పుడు వార్తలొస్తున్నాయి. నిజానికి మృణాల్‌ ఠాకూర్‌ అంత యంగ్‌ ఏమీ కాదు. ఆమె ఏడాది క్రితమే 30ల్లోకి వచ్చేసింది. దానికి తోడు నార్మల్‌ కటౌట్ కూడా కాదు. దీంతో అన్ని రకాల పాత్రలకు సరిపడదు అనే విమర్శలు వస్తున్నాయి. చీర కట్టు, రిచ్‌ లుక్‌ పాత్రలే ఆమెకు నప్పుతాయి అనే మాటలూ వినిపిస్తున్నాయి. మరోవైపు ఆమె కూడా గ్యాప్‌ ఇచ్చింది అంటున్నారు.

‘సీతారామం’ (Sita Ramam) సినిమా తర్వాత మృణాల్‌ ఠాకూర్‌ వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ వచ్చింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని మళ్లీ సినిమాలు ఓకే చేస్తుంది అంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు అవకాశాలు తగ్గుతున్నాయా? లేక ఆమెనే గ్యాప్‌ ఇచ్చిందా అనేది తెలియడం లేదు. చూద్దాం గతంలో పుకార్లు వచ్చిన ప్రభాస్‌ – హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమా, చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా కథానాయికల ప్రకటన జరిగితే తెలిసిపోతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus