వాయిదా పడ్డ సినిమాల పరిస్థితి ఏంటో…

కరోనా సమర్పించు… ‘టాలీవుడ్‌లో త్యాగం’ పార్ట్‌ 2 అంటూ పెద్ద గొంతుతో అరిచి చెప్పొచ్చేమో. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి. కరోనా తాజా వేవ్‌తో మరోసారి పెద్ద హీరోల సినిమాలన్నీ వాయిదాల బాటలోకి వచ్చేశాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో మొదలై ‘ఆచార్య’ దాకా వాయిదాలు వేస్తున్నారు. ఇంకా ఈ కోవలోకి మరికొన్ని సినిమాలు వస్తాయి అని కూడా టాక్‌. అయితే ఇక్కడ మేటర్‌ వాయిదాలు కాదు… కొత్త రిలీజ్‌ డేట్లు విషయంలో. అవును ‘ఆచార్య’ కొత్త తేదీని ప్రకటించిన నేపథ్యంలో టాలీవుడ్‌లో ‘త్యాగం -2 మొదలైంది అంటున్నారు.

కరోనా తాజా వేవ్‌ నేపథ్యంలో ఇప్పటివరకు వాయిదా పడిన సినిమాలు చూస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’ ఉన్నాయి. వీటికి కొత్త డేట్లు కావాలి. వీటికితోడు ‘త్యాగం – పార్ట్‌ 1’లో వాయిదా వేసుకున్న ‘గని’కి కూడా కొత్త డేట్‌ కావాలి. వీళ్లంతా సరైన తేదీకి కోసం చూస్తున్నారు. ‘ఆచార్య’ టీమ్‌ అయితే ముందుగా మేల్కొని ఏప్రిల్‌ 1 అంటూ కర్చీఫ్‌ వేసేసింది. ఆ రోజు విడుదల కావాల్సిన ‘సర్కారు వారి పాట’ వాయిదా పడుతుందని సమాచారం. దాని కోసం కూడా ఓ డేట్‌ కావాలి. మేకి ఆ సినిమా మూవ్‌ అవుతుందని టాక్‌.

ఇక ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ కూడా సమ్మర్‌నే టార్గెట్‌ చేశాయి అంటున్నారు. త్వరలోనే రిలీజ్‌ డేట్లు ప్రకటిస్తారని సమాచారం. మధ్యలో వరుణ్‌తేజ్‌ ‘గని’ కోసం అల్లు అరవింద్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కాకుండా ఫిబ్రవరిలో రావాల్సిన మిగిలిన సినిమాలు కూడా వాయిదా వేసే అవకాశం ఉందంటున్నారు. వచ్చే నెలలో కరోనాకేసుల ఉద్ధృతి పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆ సినిమాల వాయిదా పక్కా అని టాక్‌. ఆ లెక్కన ఫిబ్రవరిలో ఆఖరున ‘భీమ్లా నాయక్‌’ రిలీజ్‌ అవ్వాలి.

మరి ఆ రోజుకే తెస్తారో లేక వాయిదా వేస్తారో చూడాలి. పవర్‌ కల్యాణ్‌ అయితే కరోనా పరిస్థితులు నెమ్మదించాకే షూటింగ్‌ అన్నారని టాక్‌. దీంతో ‘భీమ్లా’ మిగిలిన షూటింగ్‌ పెండింగ్‌లో ఉంది. ఇది కాకుండా ‘ఖిలాడీ’, ‘మేజర్‌’ కూడా ఉన్నాయి. వాటి విడుదల సంగతేంటో చూడాలి. అలాగే మార్చిలోనూ పరిస్థితులు కుదుటపడకపోతే ‘శేఖర్‌’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ లాంటివి కూడా వాయిదా ఆలోచన చేయొచ్చు. అప్పుడు మొత్తంగా చాలా సినిమాలు విడుదలకు పేరుకుపోతాయి.

ఈ క్రమంలో ఒకరి కోసం ఒకరు వాయిదాల త్యాగం చేయాల్సి ఉంటుంది. గతంలోనే తేదీలు ప్రకటించిన వాళ్లు వెనక్కి వెళ్తారా? లేక కొత్తవాళ్లే వాళ్ల కోసం వాయిదాలు వేస్తారా అనేది తేలడం లేదు. ఏప్రిల్‌లో విడుదల అంటూ గతంలోనే ‘సలార్‌’, ‘ఎఫ్‌ 3’, ‘హరి హర వీర మల్లు’ లాంటి సినిమాలు రిలీజ్‌ డేట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సో వెయిట్‌ అండ్‌ సీ… ‘త్యాగం పార్ట్‌ 2’.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Share.