Rajinikanth: కెరీర్‌ విషయంలో తలైవా నిర్ణయం తీసేసుకున్నారా…

రజనీకాంత్‌ సినిమా రిలీజ్‌ అయ్యే ప్రతిసారి వినిపించే పుకారు… ‘ఈ సినిమా రజనీ ఆఖరి సినిమానా?’. కొన్నాళ్లు చర్చ జరిగాక… తలైవా ఎప్పటిలా కొత్త సినిమా ప్రారంభిస్తారు. షూటింగ్‌ పూర్తి చేసి విడుదల చేస్తారు. మరిప్పుడు దీపావళికి ‘పెద్దన్న’ వచ్చింది. అందుకే ఆనవాయితీగా ఈసారి కూడా ‘ఆఖరి సినిమా’ అనే టాక్‌ నడుస్తోంది. అయితే ఈసారి ఇది నిజమవుతుంది అని కోడంబాక్కం టాక్‌. రజనీకాంత్‌ ఇప్పుడు 70వ పడిలో పడ్డాడు.

దానికితోడు తరచుగా అనారోగ్యం పాలవుతూ వస్తున్నారు. ‘పెద్దన్న’ షూటింగ్‌ సమయంలో చాలాసార్లు ఇబ్బందిపడ్డారు. దీంతో కుటుంబం నుండి ఆయనకు ఒత్తిడి వస్తోందని టాక్‌. అరోగ్య దృష్ట్యా సినిమాలకు సెలవు చెప్పడమో, విరామం ఇవ్వడమో మంచిది అని ఇంట్లోవాళ్లు అంటున్నారని తమిళ సినీ వర్గాల టాక్‌. దీంతో రజనీ ఆలోచనలో పడ్డారట. ‘పెద్దన్న’ తర్వాత రజనీ… కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ మధ్య అధికారికంగా ప్రకటించారు కూడా.

అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే… ఆ సినిమా పట్టాలెక్కడం కష్టమే అనిపిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. అయితే తలైవా ఏ నిర్ణయం తీసుకుంటారు… విడవడమా విరామమా అనేది ఆసక్తికరం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus