‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) సినిమా తర్వాత మహేష్ బాబు (Mahesh Babu)… వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి. కానీ ఆ ప్రాజెక్టు ఎందుకో క్యాన్సిల్ అయ్యింది. దీంతో మహేష్ కొత్త కథలు వినడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా వెళ్లి.. మహేష్ కి కథ వినిపించాడు.అది మహేష్ కి నచ్చింది. కానీ అది వెంటనే చేసేలా లేదు అని భావించి మహేష్.. దాన్ని హోల్డ్ లో పెట్టాడు. అది ‘డెవిల్’ కథ అని, కచ్చితంగా మహేష్ తో ఆ కథ చేస్తానని…
సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ (Animal) సినిమా ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ కథ వేరే స్టార్ హీరో వద్దకు వెళ్ళిపోయింది అనే న్యూస్ ఇప్పుడు ఊపందుకుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు రాంచరణ్ (Ram Charan). అవును రాంచరణ్ తో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఒక సినిమా చేయబోతున్నాడని, అది ‘డెవిల్’ టైటిల్ తో ఉంటుంది అనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో కూడా ఇది చర్చనీయాంశం అయ్యింది.
ప్రస్తుతం బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ (Peddi) అనే సినిమా చేస్తున్న రాంచరణ్. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ‘పెద్ది’ కంప్లీట్ అయ్యే లోపు సుకుమార్ (Sukumar).. చరణ్ సినిమా స్క్రిప్ట్ ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడం కష్టమని టాక్ నడుస్తుంది. అందుకే చరణ్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయినట్టు, దాని టైటిల్ ‘డెవిల్’ అన్నట్టు ప్రచారమవుతోంది.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదట. సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు తన కంప్లీట్ ఫోకస్ ‘స్పిరిట్’ (Spirit) పైనే పెట్టాడు. ప్రస్తుతం అతని వద్ద మరో స్క్రిప్ట్ రెడీగా లేదు. ‘స్పిరిట్’ అయ్యాక అతను అల్లు అర్జున్ తో (Allu Arjun) ఓ సినిమా చేస్తున్నట్టు కూడా అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ‘యానిమల్ పార్క్’ కూడా ఉంటుందని ప్రకటన వచ్చింది. సో చరణ్ (Ram Charan) – సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్టు ఇప్పట్లో కష్టమని చెప్పాలి.