చాలా మంది హీరోలు, హీరోయిన్లు..దర్శకులు తమకు నచ్చినట్టు కనుక సినిమా తీయకపోతే.. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నారు. సింపుల్ గా ప్రమోషన్ కి రావడం మానేస్తున్నారు. తర్వాత నిర్మాతలు బతిమిలాడినా ప్రమోషన్స్ కి రావడం లేదు. అది కూడా పారితోషికంపై ఇంకాస్త ఎక్కువ డిమాండ్ చేసి లబ్దిపొందుతున్నారు. చాలా మంది హీరో హీరోయిన్లు ఇదే బాట పట్టారు. నిజానికి బాలీవుడ్ నుండే ఇలాంటి కల్చర్ మొదలైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం..
ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లంకేశ్ అంటే రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అయితే పేరుకే ఇది రావణాసురుడు పాత్ర అనుకోవాలి. ఎందుకంటే.. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పోషించిన రావణాసురుడు పాత్ర చాలా కామెడీగా ఉంది. ముందుగా అతని గెటప్ ఏమాత్రం రావణాసురుడు పాత్రలా అనిపించదు. బ్లాక్ డ్రెస్ లో, మోహన్ నిండా గడ్డం.
ఇక అతని పది తలలు ఒక్కో సీన్లో ఒక్కోలా కనిపిస్తాయి. అలాగే అది పదితలలు రో మారిన ప్రతిసారి చెవులు పెరుగుతూ ఉంటాయి. మన తెలుగు సినిమాల్లో రావణాసురుడు పుష్టిగా కనిపించినా ఒంటి నిండా బంగారం వేసుకుని హుందాగా కనిపిస్తాడు. సైఫ్ అలీ ఖాన్.. అందులో 10 వ శాతం కూడా నీట్ గా కనిపించలేదు.
అంతేకాదు.. రావణాసురుడు రాముడు, సీత విషయంలో ఎంత దుర్మార్గుడైనా అతనికి మంచి లక్షణాలు కూడా ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. ‘ఆదిపురుష్’ లో అలాంటిది చూపించింది లేదు. సో దర్శకుడు సైఫ్ కి చెప్పింది ఒకటి.. తీసింది మరొకటి అయ్యుండాలి. అందుకే అతను ప్రమోషన్ కు రావడానికి నిరాకరించి ఉండొచ్చు. సైఫ్ (Saif Ali Khan) పై ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ మామూలుగా లేదు.