Sania Mirza, Shoaib Malik: పెళ్ళైన 12 ఏళ్లకే విడాకులు తీసుకోబోతున్న షోయబ్ మాలిక్ – సానియా మీర్జా!

ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా.. 2010 లో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం అప్పట్లో పెద్ద సెన్సేషన్. భారత దేశానికి చెందిన అమ్మాయి.. ఓ పాకిస్థానీ పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేసి సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల దిష్టిబొమ్మలు తగలబెట్టారు. సోషల్ మీడియాలో ఊపందుకోని రోజుల్లో కూడా వీరి పెళ్లి వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించింది.

అయితే వీళ్ళ పెళ్లి మాత్రం సీక్రెట్ గా జరిగిపోయింది. ఆ తర్వాత కూడా సానియా పై ఆ విమర్శలు కంటిన్యూ అయినప్పటికీ.. షోయబ్ మాలిక్ సొంత దేశం పాకిస్థాన్ కాదు, దుబాయ్ అంటూ మన వాళ్ళు సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత మాలిక్- సానియా లది సూపర్ పెయిర్ అంటూ ప్రశంసలు కూడా కురిపించారు. ఆ తర్వాత సానియా మీర్జా పలు టీవీ షోలలో కూడా పాల్గొంది. ఒకటి రెండు వెబ్ సిరీస్ లలో గెస్ట్ రోల్స్ కూడా చేసింది.

ఇదిలా ఉండగా.. త్వరలో ఈ జంట విడాకులు తీసుకోబోతుందట.

అందుతున్న సమాచారం ప్రకారం.. సానియా మీర్జా- షోయబ్ మాలిక్ లు 2010 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇజాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే కొన్నాళ్లుగా వీరి మధ్య గొడవలు సంభవించడంతో విడాకులకు అప్లై చేశారట. ఈ విషయాన్ని పాక్ మీడియా వెల్లడించింది. మరి ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus