మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరిగేటప్పుడు ప్రతిసారి… ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. మేమంతా ఒకటే, ఎన్నికలయ్యాక అందరం కలసిపోతాం. గతంలో ఒకటి, రెండు సందర్భాల్లో ఇలా జరిగింది. అయితే ఇప్పుడు ప్రకాశ్‌రాజ్ విషయంలో ఇలాగే సాగుతుందా? అంటే కష్టమే అని చెబుతున్నారు పరిశీలకులు. కారణం ఇక్కడ ప్రకాశ్‌రాజ్ మీద చేసిన విమర్శలు కావు. క్యారెక్టర్ ఎసాసినేషన్ అని చెప్పాలి. దీంతో ఆయన బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది.
‘మా’ ఎన్నికల ప్రకటన రాగానే… తొలుత వచ్చిన విమర్శ ఆయన ప్రాంతం గురించి. స్థానికత అనే అంశాన్ని బలంగా ‘మా’ సభ్యుల మధ్యకు తీసుకెళ్లి, ఇంకా చెప్పాలంటే పదే పదే మాట అని, పది మందితో అనిపించి అందరి మెదళ్లలో నాటేశారు ఆ విషయాన్ని. ఆ తర్వాత నిర్మాలతో ప్రకాశ్‌రాజ్‌కు గతంలో ఉన్న సమస్యల్ని బయటకు తీశారు. సినిమా సెట్‌కు ఆలస్యంగా వస్తారు, ఎవరేమన్నా అంటే తిడతారు అని కూడా అన్నారు.
ప్రకాశ్‌రాజ్ మీద విష్ణు ప్యానల్ చేసిన ఆరోపణలు, వ్యక్తిగత విమర్శల్లో… చాలా వరకు ఇంచుమించు అలాంటివే విష్ణు మీద, అతని తండ్రి మోహన్‌బాబు మీద కూడా ఉన్నాయి. కానీ ప్రకాశ్‌రాజ్ ప్యానల్ అప్పుడప్పుడు అన్నా, వాటిని పెద్దగా వాడుకుంది లేదు. ఆఖరులో ఎప్పుడో ఆ విషయాలు కాస్త టచ్ చేశారు. కానీ విష్ణు ప్యానల్ మాత్రం ప్రకాశ్‌రాజ్ మీద అదే పనిగా దాడి చేసింది. అయితే ఇక్కడ ప్రశ్న ఆ టాపిక్‌ల వల్ల ప్రకాశ్ రాజ్ ఓడిపోయారా అనేది ఒకటి అయితే.
రెండోది ఈ వ్యక్తిగత విమర్శల వల్ల ప్రకాశ్‌రాజ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? మూడోది ప్రకాశ్‌రాజ్‌ను ఇంతగా విమర్శించిన వీరు రేపొద్దున వేరే సినిమాల్లో కలసి పని చేయాల్సి వస్తే చేస్తారా?. దానిదేముంది తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే అనుకొని ఎప్పటిలాగే కలసి నటిస్తారు అంటారా. అలా కూడా జరిగే అవకాశమూ ఉంది.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు