శంకర్ అంటే భారీ చిత్రాల దర్శకుడు. ఇది అందరికీ తెలిసిన పదమే. అయితే ఆయన సినిమాల భారీతనంలో కథ, కథనం, నటీనటులు, సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇటీవల శంకర్ సినిమాలు చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ ఇంపార్టెన్స్ చెప్పొచ్చు. అయితే శంకర్ తన తర్వాతి సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్‌ను లైట్ తీసుకోబోతున్నాడా? ప్రస్తుతం టాలీవుడ్‌లో వస్తున్న పుకార్లు చూస్తుంటే అదే అనిపిస్తోంది. చరణ్ సినిమా కోసం శంకర్ విజువల్ ఎఫెక్ట్స్‌ను తక్కువగా వాడాలని అనుకుంటున్నాడట.
దిల్ రాజు 50వ సినిమాగా శంకర్ – చరణ్ కాంబినేసన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి వివరాలు రాలేదు. అయితే పుకార్లు మాత్రం పీక్స్‌లో ఉన్నాయి. ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్ అని, కాదు సైంటిఫిక్ సినిమా అనీ ఇలా చాలా వినిపిస్తున్నాయి. హీరోయిన్, సంగీత దర్శకుడి విషయంలోనూ కొన్ని వార్తలొచ్చాయి. ఇప్పుడు వస్తున్న పుకార్లు వాటన్నింటికీ మించి అన్నమాట. ఈ సినిమా పెద్దగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండవట.
శంకర్ సినిమా అంటే పాటలు, ఫైట్లు, సీన్లు ఇలా చాలావాటిలో విజువల్ ఎఫెక్ట్స్ విరివిగా వాడతారు. మరి ఇప్పుడు అవి లేకుండా ఎలా అనేదే ప్రశ్న. అదొకటి అయితే శంకర్ ఎందుకు వీఎఫ్‌ఎక్స్ ఎందుకు వద్దనుకుంటున్నాడు అనేది మరో ప్రశ్న. నిజానికి ఇదే ఆసక్తికరం కూడా. ఈ సినిమాకు దిల్ రాజు ₹150 కోట్లు బడ్జెట్ పెట్టారు అని ఆ మధ్య వార్తలొచ్చాయి. కాబట్టి ఆ బడ్జెట్‌లో గ్రాఫిక్స్ అయితే ఇబ్బంది అని పక్కనపెడుతున్నడా అనేదే డౌటానుమానం. ఒకవేళ అదే నిజమైతే శంకర్ – చరణ్ కాంబో చప్పగా ఉంటుంది మరి.