Sushmitha: ఆ రీమేక్‌ అందుకోసం తీసుకోలేదంటున్నారు మరి

చిరంజీవి పెద్ద కూతురు సినిమా నిర్మాణ రంగంలోకి వస్తోందని ఇటీవల వార్తలొస్తున్నాయి. దీని కోసం ఆమె ఓ తమిళ సినిమా రైట్స్‌ కూడా తీసుకున్నారని మనం చదువుకున్నాం. అయితే ఈ సినిమా ఆమె నిర్మాతగా ఎంట్రీకి ట్రయల్‌ మాత్రమే అని తెలుస్తోంది. ఎందుకంటే ఆమె నిర్మాతగా మారుతున్న వెండితెరకు కాదు. ఓటీటీ కోసమేనట. అదేంటి ఇప్పటికే ఓటీటీ కోసం ఓ వెబ్‌ సిరీస్‌కి నిర్మాతగా చేశారు కదా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు వెబ్‌ఫిల్మ్‌కి నిర్మాత అట. అదన్నమాట లెక్క.

తమిళంలో నాలుగేళ్ల క్రితం వచ్చి చిత్రం ‘8 తొట్టక్కల్’. డిఫరెంట్‌ పాయింట్‌తో రూపొందిన ఈచిత్రం తమిళనాట మంచి విజయం అందుకుంది. ఆ రోజుల్లోనే ఈ సినిమా తెలుగులో రీమేక్‌ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ పట్టాలెక్కేదు. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ రీమేక్‌ ముచ్చట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి కూతురు సుష్మిత తన భర్తతో కలసి ఆ సినిమా రైట్స్‌ తీసుకున్నారు. అయితే ఈ సినిమాను కేవలం వెబ్‌ ఫిల్మ్‌గా తీసుకొస్తారట. అంటే ఓటీటీ కోసం అన్నమాట.

‘8 తొట్టక్కల్‌’ వెబ్‌ఫిల్మ్‌గా మంచి విజయం అందుకుంటే, అప్పుడు వెండితెర సినిమాలు నిర్మించాలని సుష్మిత భావిస్తున్నారట. అంటే ప్రొడ్యూసర్‌ అవ్వడానికి ఇది ట్రయల్‌ అన్నమాట. ఇందులో విజయం సాధిస్తే, మెగా ఫ్యామిలీ నుంచి మరో నిర్మాత వచ్చినట్లే. ఇప్పటికే నాగబాబు నిర్మాతగా ఉండగా, పవన్‌ కల్యాణ్‌ ఆ మధ్య నిర్మాత అయ్యారు. చరణ్‌ ఇటీవల ప్రొడ్యూసర్‌గా మారాడు. ఇప్పుడు సుష్మిత వస్తుందన్నమాట. మరి సుష్మిత ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus