Chiranjeevi, Prakash Raj: ‘మా’ ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయ్‌!

  • October 11, 2021 / 01:01 PM IST

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పోటీదారులు మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ కావొచ్చు. కానీ బ్యాగ్రౌండ్‌లో పోటీలో నిలబడింది మాత్రం మంచు మోహన్‌బాబు, చిరంజీవే. ‘మా’ ఎన్నికల్లో బాగా ఫాలో అయిన అందరికీ… ఈ విషయం సులభంగా తెలిసిపోతుంది. ఆ లెక్కన ఇప్పుడు మంచు విష్ణు గెలిచాడు. అంటే మోహన్‌బాబు గెలిచినట్లే. ఆ లెక్కన ఓడిపోయించి చిరంజీవి అనుకోవచ్చా? అవుననే అంటున్నారు పరిశీలకులు. ‘మా’ ఎన్నికల తేదీలు ప్రకటించకుండానే… తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లుగా ప్రకాశ్‌రాజ్‌ ‘నేను పోటీలో ఉన్నా’ అంటూ ముందే ప్రకటించేశారు.

ఈ క్రమంలో మెగా కుటుంబం నుండి నాగబాబు ప్రకాశ్‌రాజ్‌కు సపోర్టు చేస్తూ ముందుకొచ్చారు. దీంతో మెగా కుటుంబం సపోర్టు ఆయనే అని తేలిపోయింది. ప్రచారం కూడా దాదాపుగా అలాగే సాగింది. ప్రచారం ఆఖరులో చిరంజీవి సపోర్టు మాకే అంటూ నాగబాబు ప్రకటించారు కూడా. ఈ సమయంలో చిరంజీవి, మోహన్‌బాబు మధ్య మళ్లీ పొరపొచ్చాలు వచ్చాయనే టాక్‌ వినిపించింది. దీంతో తన కొడుకు మంచు విష్ణును గెలిపించుకోవడానికి మోహన్‌బాబు అన్ని అస్త్రాలను వాడారని తెలుస్తోంది. అందుకే మంచు విష్ణు ఘన విజయం సాధించారు.

దీంతో మోహన్‌బాబు గెలిచినట్లే… చిరంజీవి ఓడినట్లే. అలా ఎలా అంటారు… ‘ప్రకాశ్‌రాజ్‌కు చిరంజీవి నేరుగా ఎక్కడా సపోర్టు చేయలేదు కదా’ అని అంటారా. ఇప్పటివరకు ‘మా’ ఎన్నికల్లో చిరంజీవి ఎవరికీ నేరుగా సపోర్టు చేయలేదు. ఆయన కుటుంబం నుండి నాగబాబు మాత్రమే ఇలాంటి పనుల్లో ఉంటారు. అలా ప్రతిసారి నాగబాబు సపోర్టు చేసిన వ్యక్తి, ఆ ప్యానల్‌ గెలిచినప్పుడు చిరంజీవి గెలిచినట్లే అని అంటూ వచ్చారు. ఇప్పుడు నాగబాబు సపోర్టు చేసిన ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోయారు. అంటే చిరంజీవి కూడా ఓడిపోయినట్లే కదా. ఏమంటారు మరి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus