Bachhala Malli: ‘బచ్చల మల్లి’ స్టోరీలో ‘సరిపోదా’ పోలికలు నిజమేనా?
- September 9, 2024 / 10:09 PM ISTByFilmy Focus
అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) అనే సినిమా రూపొందుతుంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా (Rajesh Danda) నిర్మాత. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ వంటివి బయటకు వచ్చాయి. ఇందులో అల్లరి నరేష్ చాలా రస్టిక్ గా కనిపించాడు.గ్లింప్స్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ‘ఎందుకు తగ్గాలి.. ఎందుకు తగ్గాలి’ అంటూ అల్లరి నరేష్ పాత్రతో ఆ డైలాగ్ చెప్పించారు.
Bachhala Malli

ఇవి చూసి అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’ (Pushpa) సినిమా కథకి, ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) కథకి దగ్గర పోలికలు ఉంటాయేమో అని అంతా భావించారు. ఆ తర్వాత ఇంకా ఎన్నో అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ‘పుష్ప’ లో అల్లు అర్జున్..లా అల్లరి నరేష్ మెప్పించగలడా? అంటూ చాలా చర్చలు జరిగాయి. కానీ ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘బచ్చల మల్లి’ కథలో ‘పుష్ప’ కాదు ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) పోలికలు ఎక్కువగా ఉంటాయట.

‘బచ్చల మల్లి’ (Bachhala Malli) లో కూడా హీరో బాగా కోపిష్టి అని సమాచారం. అలాగే మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ‘సరిపోదా శనివారం’ లో కూడా అంతే..! హీరో కోపిష్టి,కొంత మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. దర్శకుడు సుబ్బు ‘బచ్చల మల్లి’ ని పూర్తిగా తన శైలికి తగ్గట్టు తెరకెక్కిస్తున్నాడట. కాబట్టి ‘సరిపోదా శనివారం’ సినిమా టేకింగ్ కి ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అంటే లైన్ ఒక్కటే అయినా టేకింగ్ వేరన్నమాట.

ఇక ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) చిత్రానికి రూ.9 కోట్లు నాన్ థియేట్రికల్, రూ.5 కోట్లు థియేట్రికల్… బిజినెస్ ఇప్పటికే జరిగినట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మొత్తంగా సినిమా అనుకున్న బడ్జెట్లో ఫినిష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.












