Nani , Srikanth Odela: నాని- శ్రీకాంత్ ఓదెల రెండో సినిమాకి టైటిల్ అదే..!

నేచురల్ స్టార్ నాని  (Nani) ఈ మధ్య స్పీడ్ పెంచి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది ‘దసరా’ (Dasara)  ‘హాయ్ నాన్న’ (Hi Nanna)  రిలీజ్ అయ్యాయి. అవి రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది కూడా బాగా ఆడింది. వెంటనే ‘హిట్ 3’ మొదలుపెట్టాడు. అప్పుడే 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మరోపక్క శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

Nani , Srikanth Odela

ఇప్పటివరకు లొకేషన్స్ వేట జరిగింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా చాలా వయొలెన్స్ తో నిండి ఉంటుందట. ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం కథ సాగుతుందట. అయితే ‘సరిపోదా శనివారం’ లో సోకులపాలెం అనే ఫిక్షనల్ ఏరియాని సృష్టించినట్టే.. ఈ సినిమాలో కూడా ఓ ఫిక్షనల్ ఏరియాని సృష్టించారట. దాని పేరు ‘పారడైజ్’ అని తెలుస్తుంది. ఆ పదానికి ‘స్వర్గం’ అనే మీనింగ్ వస్తుందట. కానీ ‘పారడైజ్’ పేరుతో రెస్టారెంట్లు ఉన్నాయి.

అవి బాగా ఫేమస్ కూడా..! అయితే ‘పారడైజ్’ లో పాన్ ఇండియా సౌండింగ్ కూడా ఉంది. అందుకే ఈ సినిమాకి టైటిల్ కూడా ‘పారడైజ్’ అనే పెట్టబోతున్నారనేది తాజా సమాచారం.దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. దీనిని కూడా నానితో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నాడట. పక్క భాషల్లోని నటీనటులు కూడా ఈ సినిమాలో నటిస్తారట. దీనిని కూడా ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. దీనికి ఏకంగా రూ.125 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నట్లు వినికిడి.

విశ్వక్ సేన్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus