Trivikram: ఆ ఐటెమ్‌ సాంగ్‌.. ఐటెమ్‌ సాంగ్‌లాగే ఉంటుందా?

త్రివిక్రమ్‌ సినిమా అంటే ఓ కాన్సెప్ట్‌ ప్రకారం సాగిపోతుంది అంటుంటారు. ఆయన సినిమాల్లో హీరోలు ఇలానే కనిపించాలి, హీరోయిన్లు కాస్త గ్లామర్‌గా ఉండాలి. అయితే ఓవర్‌ ఎక్స్‌పోజింగ్‌ ఉండకూడదు. ఐటెమ్స్ సాంగ్స్‌ లాంటివి ఉండవు. కామెడీ బీభత్సంగా ఉండాలి అని అనుకుంటుంటారు. ఆయన సినిమాలు చూసిన వాళ్లు ఎవరైనా ఈ విషయం చెప్పేస్తారు. అయితే.. ఇందులో పక్కాగా పాటించే అనధికార నియమాల్లో ఐటెమ్‌ సాంగ్‌ని పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

త్రివిక్రమ్‌ – మహేష్‌బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. #SSMB28 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ నిర్వహించారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాల్సి ఉంది. అయితే మహేష్‌ మాతృమూర్తి ఇందిరా దేవి కన్నుమూయడంతో కొత్త షెడ్యూల్‌ ఇంత త్వరలో ఉండదు అంటున్నారు. అయితే ఈ కొత్త షెడ్యూల్‌లో ఓ ఐటెమ్‌ సాంగ్‌ తీద్దాం అనుకున్నారట.

అవును, మీరు విన్నది నిజమే. త్రివిక్రమ్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ పెడతారు అంట. ముందుగా చెప్పినట్లు ఆయన సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ ఉండవు. ‘అత్తారింటి దారేది’ సినిమాలో పబ్‌ సాంగ్‌ ఉంది. అయితే అందులో కూడా హీరోయిన్స్‌ చీరకట్టులోనే కనిపిస్తారు. అయితే కాస్త హాట్‌ లుక్స్‌లో ఉంటారు లెండి. అయితే మహేష్‌ సినిమాలో మాత్రం ఫుల్‌ ప్లెడ్జ్‌ ఐటెమ్‌ సాంగ్‌ పెట్టాలని ఫిక్స్‌ అయ్యారని టాక్‌. దీని కోసం స్టార్‌ హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారట.

మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. మొదటి రెండు సినిమాలు విజయాలు అందుకున్నా.. బ్లాక్‌బస్టర్‌ స్థాయి విజయాలు అయితే కావు. దీంతో ఈ సినిమాలో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. మరోవైపు హారిక హాసిని క్రియేషన్స్‌లో మహేష్‌బాబు నటిస్తున్న తొలి సినిమా ఇది. దీంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటలో అగ్ర నాయికనే ఐటెమ్‌ భామగా చూపించే అవకాశం ఉంది అంటున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus