Upasana: ఉపాసన పోస్ట్ వెనుక అసలు కథ ఇదేనా?

రామ్ చరణ్ భార్య ఉపాసన సేవా కార్యక్రమాల ద్వారా ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే. అపోలో లైఫ్ చైర్ పర్సన్ గా బిజీగా ఉన్నప్పటికీ ఇతర కార్యక్రమాలకు కూడా ఉపాసన ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఉపాసన ఆడి కంపెనీకి చెందిన ఒక ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో కార్లు ఉన్నా మరో హై ఎండ్ కారును ఉపాసన కొనుగోలు చేశారు.

కోటీ 66 లక్షల రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ఉపాసన రెడ్ కలర్ కారును కొనుగోలు చేయగా ఈ కారు గురించి ఉపాసన చెబుతూ ఈ ప్రపంచంలో ప్రతిదీ నిరంతరం అప్ గ్రేడ్ అవుతుందని అన్నారు. ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా నన్ను నేను అప్ గ్రేడ్ చేసుకున్నానని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం. నా అన్ని అవసరాలకు ఈ కారు ఉత్తమ ప్రయాణ సహచరుడు అని ఉపాసన చెప్పుకొచ్చారు.

అయితే ఉపాసన ఈ కారు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఉపాసన ఈ కారుకు బ్రాండింగ్ చేస్తూ ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఉపాసన ఈ కారు గురించి అందరికీ తెలిసేలా చేయడం ద్వారా తన పోస్ట్ ద్వారా కారుపై మంచి అభిప్రాయం కలిగే విధంగా చేయడంలో సక్సెస్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఉపాసన తన క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

చరణ్ భార్య కావడంతో మెగా ఫ్యాన్స్ కూడా ప్రతి విషయంలో ఉపాసనను ప్రోత్సహిస్తున్నారు. ఉపాసన ప్రతి పోస్ట్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్, లైక్స్ రావడానికి మెగా ఫ్యాన్స్ కారణమని చెప్పవచ్చు. ఉపాసన చరణ్ జీవితంలోకి వచ్చిన తర్వాత చరణ్ కెరీర్ పరంగా మరింత క్రేజ్ ను పెంచుకున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చరణ్ ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus