టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల హడావుడి, చర్చ, రచ్చ ముగిసింది అనుకుంటుండగా మరో చర్చ మొదలైంది. ఇంకా చెప్పలంటే చిన్నపాటి రచ్చే అని చెప్పాలి. ఈ సారి నటులు కాదు, దర్శకుల వంతు. ‘మా’ ఎన్నికల సమయంలో పోటీ అర్హత విషయంలోనే చర్చ నడిచింది. ఆఖరికి అదే ఫలితానికి కారణమైంది అన్నారు కూడా. ఇప్పుడు దర్శకుల సంఘానికి సంబంధించిన ఎన్నికల్లో కూడా అదే పాయింట్ కీలకంగా మారింది.
తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘంలో ఈ నెల 14న జరగనున్న ఎన్నికల కోసం పలువురు దర్శకులు పోటీపడుతున్నారు. అందులో తాజాగా ఇద్దరి నామినేషన్లని తిరస్కరించడంతో వివాదానికి మొదలైంది. పాత్రికేయుడు, దర్శకుడైన ప్రభు నామినేషన్‌ను తిరస్కరించారు. ఆయన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నందున దర్శకుల సంఘం ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని నామినేషన్ తిరస్కరించారు. అయితే ప్రభు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. చిత్ర పరిశ్రమ 24 క్రాఫ్ట్స్‌లోని ఏదైనా ఒక అసోసియేషన్ పదవిలో ఉంటే…
దర్శకుల సంఘంలో పోటీ చేయకూడదనే నిబంధన ఉంది. అయితే 24 క్రాఫ్ట్‌కీ, క్రిటిక్స్ అసోసియేషన్‌కీ సంబంధం లేదని ప్రభు అంటున్నారు. అన్యాయంగా తన నామినేషన్‌ని తిరస్కరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీనియర్ దర్శకుడు మద్దినేని రమేష్ నామినేషన్‌ను కూడా తిరస్కరించారు. దీని వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!