Trivikram: చుట్టూ నీళ్లు చేరుతున్నాయ్‌ మాటల మాంత్రికా? కాస్త చూసుకో?

టాలీవుడ్‌లో త్రివిక్రమ్‌ రాతను కొట్టేటోళ్లు లేరు. ఆయన సినిమా తీతను వేలెత్తి చూపించోటోళ్లు లేరు. అలా సాగింది ఆయన సినిమా ప్రయాణం. ఆయన తీసిన సినిమా ఫెయిల్‌ అయి ఉండొచ్చు కానీ.. ఆయన ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు. అయితే ఇప్పుడు ఈ మాటల మెల్లంగా మారుతున్నాయా? ఆయన డెసిషన్‌ మీద ఆలోచనలు మొదలవుతున్నాయా? ఏమో సోషల్‌ మీడియాలో చూస్తే అలానే అనిపిస్తోంది. ఆయన అడుగులు ఆయన అభిమానులకే కాదు, ఇద్దరు అగ్ర హీరోల అభిమానులకు కూడా ఇబ్బందిపెడుతున్నాయి.

ఇంత క్లియర్‌గా చెప్పాక ఆ హీరోలు పవన్‌ కల్యాణ్‌, మహేష్‌ బాబు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్‌కు ఈ ఇద్దరు హీరోలూ మంచి స్నేహితులు. పవన్‌ అయితే ఏకంగా త్రివిక్రమ్‌ను గురు సమానులు అంటుంటారు. అలాంటి గురువు పవన్‌ను తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ కొంతమంది పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ గగ్గోలు పెడుతున్నారు. కారణం పవన్‌ను ఆయన రీమేక్‌లవైపు తీసుకెళ్తుండటమే. పవన్‌ నుండి రీసెంట్‌ రిలీజ్ అయిన మూడు సినిమాలూ రీమేక్‌లు కావడం గమనార్హం.

ఆ మూడు విజయాలు సాధించి ఉండొచ్చు కానీ పవన్‌ను రీమేక్‌ స్టార్‌ను చేసేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఇదొకవైపు ఉండగా మరోవైపు మహేష్‌బాబు ఫ్యాన్స్‌ మరోలా బాధపడుతున్నారు. తమ హీరోతో సినిమా స్టార్ట్‌ చేసి దాని సంగతి చూడకుండా పవన్‌తో వరుసగా ప్రాజెక్టులు చేయడం ఏంటి, మధ్యలో అల్లు అర్జున్‌ సినిమాను అంత కంగారుగా అనౌన్స్‌ చేయడం ఏంటి అని అంటున్నారు. ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయకుండా గ్యాప్‌లు ఎందుకు అని అంటున్నారు.

దీంతో త్రివిక్రమ్‌ (Trivikram) మీద, ఆయన నిర్ణయాల మీద, ఆయన ఆలోచనల దాడి మొదలైంది. దీంతో త్రివిక్రమ్‌ చుట్టూ నీళ్లు చేరుతున్నాయని, అవి ఆయనకు ఇబ్బంది కలిగించేలోపే ఆయన అసలు విషయం అర్థం చేసుకోవాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. అయితే ఇక్కడో విషయం మనం ఆయనకు చెప్పేటంతోళ్లం కాదు. కానీ మనం చెప్పేది మంచి అయినప్పుడు ఎంత పెద్దవాళ్లకైనా చెప్పొచ్చు అంటారు. ఆ లెక్కనే ఈ మాటలు తీసుకొని అభిమానులకు ఇబ్బంది కలగకుండా త్రివిక్రమ్‌ ఆలోచనలు చేయాలని ఫ్యాన్స్‌ అంటున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus