అల్లరి నరేష్ హీరోగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే చిత్రం రూపొందుతోంది. మారేడుమిల్లి నేపథ్యంలో సాగే కథ ఇది. నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా ఎ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘హాస్య మూవీస్’ ‘జీ స్టూడియోస్’ బ్యానర్ల రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.ఈరోజు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
‘అడవుల్లో ఉండే ట్రైబల్స్.. ఓటు హక్కు ఉన్నా దానిని వినియోగించుకోరని, వాళ్లలో ఎక్కువ శాతం చదువుకోని వాళ్ళు ఉన్నారు అని’.. వాళ్లకి ఓటు హక్కు గురించి వివరించడానికి వెళ్లిన హీరో అండ్ టీం.. ఏ పర్పస్ మీద వెళ్లారు.. వాళ్ళ ప్రయత్నం ఫలించిందా లేదా?’ అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్లు టీజర్ తో క్లారిటీ ఇచ్చేసారు. ‘నాంది’ చిత్రంలో లానే ఈ సినిమాలో కూడా హీరో అల్లరి నరేష్ న్యాయం కోసం తన్నులు తింటూనే కనిపిస్తున్నాడు.
ఈ మూవీ కూడా సీరియస్ ప్లాట్లోనే సాగుతుంది అని క్లారిటీ ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల అందించిన నేపధ్య సంగీతం బాగుంది. విజువల్స్ బాగున్నాయి. టీజర్ ఓకే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 22 లొకేషన్స్ లో 50 రోజుల పాటు తీసినట్టు చిత్ర బృందం ఈ మధ్యనే చెప్పుకొచ్చింది. 250 మంది ఈ చిత్రం కోసం పని చేసినట్టు కూడా తెలియజేసారు. ఈ చిత్రం కూడా అల్లరి నరేష్ నటన ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :