‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు అనగా నవంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ‘జీ స్టూడియోస్’ తో కలిసి ‘హాస్య మూవీస్’ పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు.నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ ఎందుకో మొదటి నుండి ఈ మూవీ పై బజ్ పెద్దగా క్రియేట్ అవ్వలేదు.

ప్రమోషన్లు కూడా అంతంత మాత్రంగానే జరిగాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఉన్నప్పటికీ.. థీమ్ అంతా సీరియస్ గా సాగిందని తెలుస్తుంది. ఓవరాల్ గా సో సో గా ఫస్ట్ హాఫ్ సాగిందని, సెకండ్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ ఉందని తెలుస్తుంది. ‘నాంది’ సినిమా సీరియస్ గా సాగినా అది హిట్ అవ్వడానికి వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి పాత్రలు బాగా పండాయని.

అయితే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ లో అలా హైలెట్ అయిన పాత్ర లేదని సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్లో కామెంట్లు చేస్తున్నారు. అల్లరి నరేష్ నుండి ఆశించే కామెడీ కూడా ఈ సినిమాలో ఉండదట.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus