స్టార్ హీరోలు (Star Heroes) చాలా వరకు సీరియస్ సబ్జెక్టులే చేస్తున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ పై ఉన్న మోజుతో లార్జర్ దేన్ లైఫ్ కథలకే ఓకే చెబుతున్నారు. యాక్షన్ అడ్వెంచర్, మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సోసియో ఫాంటసీ, సీరియస్ థ్రిల్లర్, పీరియాడిక్ డ్రామా… అంటూ ఇలా సీరియస్ డ్రామాలే చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలు కామెడీ టచ్ ఉన్న సినిమాలు చేసి ఎంటర్టైన్ చేసేవారు. సినిమాలో ఎంత యాక్షన్ ఉన్నా.. కామెడీ సమపాళ్లలో ఉండేలా చూసుకునేవారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో కామెడీ కరువైంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) ‘బ్రో’ (BRO)… ఇలా అన్నీ సీరియస్ డ్రామాలే.
మహేష్ బాబు (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాల్లో కామెడీ ఉన్నా వర్కౌట్ కాలేదు.
ప్రభాస్ (Prabhas) అయితే ‘మిర్చి’ (Mirchi) తర్వాత ఒక్క ఎంటర్టైన్మెంట్ సినిమా కూడా చేయలేదు. ‘ది రాజాసాబ్’ (The Rajasaab) లో కామెడీ ఉందంటున్నారు. కానీ మారుతి (Maruthi Dasari) మార్క్ కామెడీ ప్రభాస్ వంటి పెద్ద హీరోలకి సెట్ అవ్వదనే అనుమానాలు కూడా ఉన్నాయి.
అల్లు అర్జున్ (Allu Arjun) ‘రేసుగుర్రం’ (Race Gurram) తర్వాత సరైన కామెడీ సినిమా చేసింది లేదు.
రాంచరణ్ (Ram Charan) కూడా అంతే. అతని మార్క్ కామెడీ సినిమాల్లో కనిపించడం లేదు.
‘బాద్ షా’ (Baadshah) తర్వాత ఎన్టీఆర్ (Jr NTR) కామెడీ టచ్ ఉన్న సినిమా చేయలేదు.
స్టార్ హీరోల సినిమాలు బాగున్నాయి అంటే కచ్చితంగా జనం థియేటర్ కి వస్తారు. కానీ కామెడీ ఉందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడతారు. ఈ తప్పు తెలుసుకుని వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చేసి పెద్ద హిట్టు కొట్టారు. అందుకే ఇప్పుడు చిరు కూడా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో కామెడీ టచ్ ఉన్న సినిమా చేస్తున్నారు.