తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) దర్శకత్వంలో రూపొందిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (Jaabilamma Neeku Antha Kopama) ఫిబ్రవరి 21న తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ధనుష్ మేనల్లుడు పవిష్ ఈ సినిమాలో హీరోగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి. ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) చేసిన స్పెషల్ సాంగ్ ‘గోల్డెన్ స్పారో’ కి మంచి స్పందన వచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతంలో రూపొందిన పాటలు బాగున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి’ సంస్థ రిలీజ్ చేసింది.
మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ అదిరిపోతాయేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది ఈ సినిమా. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.52 cr |
సీడెడ్ | 0.19 cr |
ఆంధ్ర(టోటల్) | 0.38 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.09 cr |
‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ (Jaabilamma Neeku Antha Kopama) చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.8 కోట్లు. అయితే మొదటి వారం ఈ సినిమా రూ.1.09 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి రూ.0.71 కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే అది కష్టంగానే కనిపిస్తుంది. తెలుగులో ఈ సినిమాని మినిమమ్ ప్రమోషన్ చేసినా.. పాజిటివ్ టాక్ ప్రభావం వల్ల కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యి ఉండేది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి ఇంకా థియేటర్స్ ఉన్నాయి.