తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ‘పుష్ప 2’ (Pushpa 2) వంటి భారీ హిట్ తర్వాత నార్త్ ఆడియెన్స్‌లో క్రేజ్ పెరిగిన నేపథ్యంలో, ‘జాట్’ (Jaat) అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్‌తో మైత్రి తన బాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా, గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘క్రాక్’ (Krack), ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) వంటి మాస్ సినిమాలు హిట్ చేసిన గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో అడుగు పెట్టడం, సన్నీ డియోల్ ‘గదర్ 2’ (Gadar 2) సక్సెస్ తర్వాత మళ్లీ మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతుండటం.. ఈ కాంబినేషన్‌కి మంచి బజ్ తీసుకొచ్చింది. ట్రైలర్ చూస్తే సన్నీ డియోల్ పాత్రను చాలా ఇంటెన్స్‌గా డిజైన్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కథ కొత్తగా ఉన్నా, మాస్ కమర్షియల్ ఫార్ములాతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టు అర్థమవుతోంది.
మైత్రి ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టిందన్న వార్తలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘జాట్’ సినిమా కేవలం ఓ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, మైత్రి సంస్థకు బాలీవుడ్‌లో పాయింట్ ఆఫ్ ఎంట్రీ కావాలన్నది అసలైన వ్యూహం. అందుకే గోపీచంద్ మలినేని వంటి కమర్షియల్ మాస్టర్‌తో బాలీవుడ్ మార్కెట్‌లో ప్రయోగం చేస్తోంది.
ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తే మైత్రి మరో స్థాయికి వెళ్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ (Salman Khan), షాహిద్ కపూర్ (Shahid Kapoor), అక్షయ్ కుమార్ (Akshay Kumar) వంటి స్టార్ హీరోలతో చర్చలు జరుపుతోందన్న టాక్ ఉంది. సౌత్ మాస్ డైరెక్టర్స్‌తో నార్త్ స్టార్స్‌ను కాంబినేషన్ చేయడమే మైత్రి ప్లాన్. మొత్తానికి ‘జాట్’ రిజల్ట్ మైత్రి బాలీవుడ్ వ్యూహానికి డెసిషన్ మేకర్. గదర్ 2 తరహాలో స్పందన వస్తే, మైత్రి సౌత్ నార్త్ కలయికకు బిగ్ బెనిఫిట్ దక్కే అవకాశం పక్కా.