కొంతమంది అభిమానులు వాళ్ల హీరోల సినిమాల పేర్లు చెబితే మురిసిపోతారు, ఇంకొన్ని సినిమాల పేర్లు చెబితే బెదిరిపోతారు. వద్దు బాబోయ్ వద్దు.. ఆ సినిమా మాకొద్దు అని బేంబేలెత్తిపోతారు. ప్రతి హీరోకి ఇలాంటి సినిమాలు ఉంటాయి. అలా రామ్‌చరణ్ (Ram Charan) కెరీర్‌లో కొన్ని సినిమాలు ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game changer) కూడా ఇలాంటిదే అని చెప్పాలి. ఆ సినిమా నిర్మాత కూడా ఆ సినిమా గురించి రిలీజ్ తర్వాత పట్టించుకోలేదు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అలాంటి సినిమాను జపాన్ వాసులు తమ దగ్గర రిలీజ్ చేయమని అడుగుతున్నారు అంటే నమ్ముతారా? అవును ఇది జరిగింది. రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల జపాన్‌లో అతని అభిమానులు అందరూ కలసి వేడుకలు జరుపుకున్నారు. ఈ క్రమంలో షూట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వీ లవ్ రామ్‌చరణ్’ అంటూ అభిమానులు అంతా ఒక్కసారిగా సందడి చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. దాంతోపాటు ‘గేమ్ ఛేంజర్‌ను’ మా దగ్గర రిలీజ్ చేయమని అడిగే బ్యానర్ కూడా చూడొచ్చు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా నుండి చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆ సినిమా జపాన్‌లో మంచి విజయం అందుకుంది కూడా. చరణ్‌తోపాటు ఎన్టీఆర్‌కి (Jr NTR) కూడా అక్కడ ఫ్యాన్ బేస్ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే తారక్ అక్కడ ‘దేవర’ (Devara) ప్రచారం చేస్తుండగా.. ఇప్పుడు చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ రిక్వెస్ట్ వచ్చింది. అయితే మరి నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఈ ధైర్యం చేస్తారా అనేది చూడాలి.
ఎందుకంటే ఇక్కడ సినిమా వచ్చినప్పుడు తొలి రోజే దిల్ రాజు వదిలేశారు అనే విమర్శలు వచ్చాయి. సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ రాగానే ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా పనుల్లో బిజీ అయిపోయారని గుర్రుగా ఉన్నారు అభిమానులు. మరోవైపు ఆయన వివిధ సందర్భాల్లో సినిమా గురించి చేసిన కామెంట్స్ కూడా అలాంటి ఫీలింగే కలిగించాయి.
WE LOVE CHARAN…
Man of Masses #RamCharan’s Japan fans celebrated his 40th birthday with a special screening, honoring our Global Star with love and admiration! ❤️#HBDRamCharan @AlwaysRamCharan pic.twitter.com/cl2Km8B6ld
— WC (@whynotcinemasHQ) March 27, 2025