Rohini: జర్నలిస్ట్ పై ఓ రేంజ్లో రెచ్చిపోయిన యాంకర్ రోహిణి.!

ప్రముఖ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంకర్ అయినటువంటి రోహిణి (Jabardasth Rohini) అందరికీ సుపరిచితమే. ఈమె చాలా సరదాగా, చలాకీగా కనిపిస్తుంది. ప్రేక్షకుల్లో రోహిణిపై మంచి అభిప్రాయమే ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా రోహిణి ఓ సీనియర్ జర్నలిస్ట్..ని నిలదీస్తూ ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. రోహిణి తన ఇంస్టాగ్రామ్ వీడియో ద్వారా మాట్లాడుతూ..”ఇటీవల నేను ‘ది బర్త్ డే బాయ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా ‘రేవ్ పార్టీలో దొరికినట్టు’ ఓ ప్రాంక్ వీడియో చేశాను. దాన్ని చాలా మంది అర్థం చేసుకున్నారు.

Rohini

సినిమా ప్రమోషన్లో భాగంగా చేశానని తెలుసుకుని అందరూ నవ్వుకున్నారు. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్.. దాని గురించి బేసిక్ డీటెయిల్స్ కూడా తెలియకుండా.. ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి ఇష్టమొచ్చినట్టు వాగాడు. ‘ఆ దొరికే ఉంటుంది .. నిప్పు లేనిదే పొగ రాదుగా…’ అంటూ కామెంట్లు చేశాడు. నేను మందు కూడా తాగను. సరే అది పక్కన పెడితే..నా ఫిజిక్ గురించి కూడా తప్పుగా మాట్లాడారు. ‘ఆ అమ్మాయి సర్జరీ వల్ల లావైపోయింది.

పెళ్ళి చేసుకునే ఉద్దేశం కూడా ఆమెకు లేనట్టు ఉంది.లావుగా ఉంది కదా.. ఆమెను ఎవరు పెళ్ళి చేసుకుంటారు?’ అంటూ ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేశారు. ఏ లావుగా ఉంటే పెళ్ళి చేసుకోకూడదా? జర్నలిస్ట్..లు అంటే నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. మీకు ఏమీ పని లేకపోతే ఇంట్లో కూర్చోండి. అంతేకానీ ఇలా ఇంటర్వ్యూలకి వచ్చి ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి.. నేను (Rohini) మాటల్తో చెబుతున్నాను. అదే వేరే ఎవరైనా అయితే చెప్పు తీసుకుని కొట్టేదాన్ని” అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.

 ‘కల్కి 2’ ప్రశ్నలు.. మరిన్ని అడగండి అంటూ… క్లారిటీ ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus