Comedian Avinash Mother: గుండెపోటుకు గురైన అవినాష్ తల్లి.. కన్నీళ్లు పెట్టుకున్న అవినాష్!

  • July 16, 2023 / 04:49 PM IST

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగు పెట్టారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా పలు టీవీ షోలో నటిస్తూ సందడి చేస్తున్నటువంటి అవినాష్ మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు.

ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారానో అలాగే బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సంపాదించుకున్నటువంటి అవినాష్ తాజాగా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మకు ఇలా అవుతుందని ఊహించలేదు అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. అయితే ఈ వీడియోలో తన తల్లి అనారోగ్యానికి గురయ్యారని చెబుతూ అవినాష్ (Avinash) ఎమోషనల్ అయ్యారు. తన తల్లి మల్లమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని అవినాష్ తెలిపారు.

గత కొంతకాలంగా అమ్మ షుగర్ తో బాధపడుతుంది దీంతో తన ఆరోగ్యం బాగాలేదు అయితే ఉన్నఫలంగా తాను అనారోగ్యానికి గురి కావడంతో దగ్గరలోనే హాస్పిటల్ కి తీసుకెళ్లాం తన గుండె చాలా వీక్ ఉందని చెప్పడంతో వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ చికిత్స చేయించానని తెలిపారు. అయితే గుండెకు రెండు పెద్ద బ్లాక్స్ ఉన్నాయని వెంటనే వైద్యులు తనకు స్టంట్ వేశారని తెలిపారు.

ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండే అమ్మ ఇలా ఆస్పత్రి బెడ్ పై ఉండడం చూసి తనకు కన్నీళ్లు ఆగడం లేదు అంటూ అవినాష్ తెలియజేశారు. అయితే తన తల్లి కూడా ఈ విషయం గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.తన పెద్ద కొడుకు కనుక లేకపోతే ఈపాటికి తన ఊర్లోనే ప్రాణాలు కోల్పోయేవని తన కొడుకే తన ప్రాణాలను కాపాడారు అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇంటికి వెళ్లారని తెలుస్తోంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus