Kevvu Karthik: ‘జబర్దస్త్’ ఫేమ్ కెవ్వు కార్తీక్ పెళ్లి ఫిక్స్.. ఫోటోలతో క్లారిటీ..!

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీటి తర్వాత చాలా కామెడీ షోలు వచ్చినప్పటికీ.. అవి ‘జబర్దస్త్’ ని మించలేకపోయాయి. ఇదిలా ఉండగా.. ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ‘జబర్దస్త్’ చాలా మందికి లైఫ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో జబర్దస్త్ నటీనటులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు సినిమాల్లో కూడా వీళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ షోలో నటించిన వారు నటిస్తున్న వారు..

ఇళ్లు, కార్లు, నగలు కొనుక్కోవడమే కాకుండా.. సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టేసి, చేతినిండా సంపాదిస్తున్నారు. వీళ్ళకి సంబంధించిన ఏ వార్త అయినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కనుక ఏదైనా వార్త వస్తే అది ట్రెండింగ్లో నిలుస్తుంది అని చెప్పాలి. ఇదిలా ఉండగా..త్వరలో ఓ జబర్దస్త్ నటుడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడట.

వివరాల్లోకి వెళితే.. కెవ్వు కార్తీక్ (Kevvu Karthik) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తనకు కాబోయే భార్యతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేసాడు. ‘మీ జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి వస్తే.. లైఫ్ మరింత సంతోషంగా ఉంటుందని కొంతమంది అంటారు.బహుశా అది ఇదే కావచ్చు. నా జీవితంలోకి వస్తున్నందుకు థాంక్యూ బ్యూటీఫుల్. నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.’ అంటూ రాసుకొచ్చాడు కెవ్వు కార్తీక్.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus