Punch Prasad: పంచ్ ప్రసాద్ కన్నీటి కష్టాల గురించి మీకు తెలుసా?

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన పంచ్ ప్రసాద్ ప్రముఖ కామెడీ షోల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు. గత కొన్నిరోజులుగా ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితమైన పంచ్ ప్రసాద్ తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం. పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ మాది లవ్ మ్యారేజ్ అని నిశ్చితార్థం తర్వాత కిడ్నీ సమస్య బయటపడిందని అన్నారు. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవద్దని నా భార్యకు సూచించానని

నా భార్య మాత్రం ఒక్కరోజు నాతో కలిసి ఉన్నా చాలని చెప్పి పెళ్లి చేసుకుందని పంచ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. పెళ్లైన తర్వాత నేను మణికొండలో ఫ్యామిలీతో ఉండేవాడినని నా భార్య గర్భవతిగా ఉన్న సమయంలో నాకు ఊపిరి తీసుకోవడం కష్టమైందని అన్నారు. ఆ సమయంలో నోరు, ముక్కు నుంచి రక్తం వచ్చిందని పంచ్ ప్రసాద్ వెల్లడించారు. ఈ విషయం తెలిసి గెటప్ శ్రీను నా భార్యకు 50,000 రూపాయలు ఇచ్చి ఆస్పత్రిలో చేర్పించాడని పంచ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.

కిడ్నీల సమస్య వల్ల నొప్పి, ఖర్చులను భరించడం చేత కాక ఒకానొక సమయంలో చనిపోవాలని అనుకున్నానని పంచ్ ప్రసాద్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం నా ఆరోగ్యం గురించి పూర్తిగా నా భార్య చూసుకుంటుందని పంచ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ విషయాలు తెలిసి పంచ్ ప్రసాద్ భార్య గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పంచ్ ప్రసాద్ భార్యలాంటి గొప్ప వ్యక్తులు అరుదుగా ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండట గమనార్హం. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అరుదైన ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ ఉండగా ఈ సమస్య నుంచి అతను త్వరగా కోలుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకొని టీవీ షోలతో బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus