Emmanuel: కొత్త కారు కొనుగోలు చేసిన ‘జబర్దస్త్’ ఇమాన్యుయేల్.. దాని ధర ఎంతో తెలుసా?

బుల్లితెర పై ఎక్కువగా సందడి చేసేది ‘జబర్దస్త్’ ఆర్టిస్టులనే చెప్పాలి. వీళ్లకు సోషల్ మీడియాలో మామూలు క్రేజ్ ఉండదు. ఒకటి రెండు షోలలో పాపులారిటీని సంపాదించుకున్న వెంటనే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలకు వెళ్లడం అక్కడ భారీ పారితోషికాలు అందుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ భారీగా సంపాదించిన వాళ్లంతా ఇల్లులు కొనేసుకుంటున్నారు. ఈలోగా బుల్లితెర పై సంపాదించిన దాంతో కార్లు వంటివి కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బుల్లితెర ఆర్టిస్ లు అందరూ వరుసగా కొత్త కార్లు కొంటున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం.

ఇటీవల కాలంలో బిగ్ బాస్ కంటెస్టెంట్, టీవీ9 యాంకర్ అయిన శివ జ్యోతి బెంజ్ కారు కొనుగోలు చేసింది.పవిత్ర, రచ్చ రవి, షన్ను, ‘బిగ్ బాస్’ హమీద వంటి వారు కొత్త కార్లు కొని తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్ కూడా కొత్త కారు కొనుగోలు చేశాడు. వర్షతో కలిసి ఇతను చేసే స్కిట్లు చాలా ఫేమస్. ఇతను కారు కొనుక్కోవాలని చాలా ఆశ ఉండేదట. మొత్తానికి అతని కలను సాకారం చేసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు ఇమాన్యుయేల్.

“చివరకు నేను కన్న కల నిజమైంది.. నా లైఫ్‌లో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు.. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.. మీ అందరి ప్రేమ, మద్దతకు థాంక్స్” అంటూ ఇమాన్యుయేల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇక ఇమాన్యుయేల్ కొనుగోలు చేసిన కారు హ్యుండై వెన్యూ అని టాక్. దీని ధర రూ.7 లక్షలు లేదా రూ.8 లక్షలు ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇమాన్యుయేల్ పక్కన ఎప్పుడూ వర్ష ఉండేది కానీ ఈసారి రోహిణి ఉండడాన్ని గమనించవచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus