Jabardasth Pavitra: వైరల్ అవుతున్న సంతోష్-పవిత్రలా నిశ్చితార్థం ఫోటోలు

బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. అందులో లేడీ కమెడియన్‌గా అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్‌ చేసింది. అయితే ఆమె ఇప్పటికే తన పెళ్లి విషయంలో రెండుసార్లు ఫ్రాంక్‌ వీడియోలు చేసింది. కానీ మూడోసారి మాత్రం అలాంటిది ఏమీ లేకుండా నిజంగానే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

తన ప్రియుడు సంతోష్‌తో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు షేర్‌ చేసింది. నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్‌కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి, మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్‌.. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు.. నా కోసం ఒక సంవత్సరం నుంచి వేచి ఉన్నాడు.. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది.

నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో ఎదుర్కొందాం. నా జీవితంలో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు.నాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణిద్దాం..’ అని తన పోస్ట్‌కు ‍క్యాప్షన్‌ జోడించింది పవిత్ర. అలాగే వారి ప్రేమను అంగీకరించిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అయితే (Jabardasth Pavitra) పవిత్ర అభిమానులకు సంతోష్‌ కుమార్‌ ఇదివరకే తెలుసు.

గతంలో ఇతడు స్టేజిమీద అందరి ముందే పవిత్రకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. కానీ అప్పుడు ఏ సమాధానమూ చెప్పని పవిత్ర.. తర్వాత సంతోష్‌ కుమార్‌తో కలిసి వాలంటైన్స్‌ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే యాంకర్ వారిని లవ్‌ ప్రపోజ్‌ చేసుకోవాలని కోరగా ఆమె తెగ సిగ్గుపడింది. ఎట్టకేలకు అతడితోనే ఏడడుగులు వేసేందుకు రెడీ అవడంతో అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus